త్రివిక్రమ్ మంచి కసి మీద ఉన్నాడుగా

Update: 2018-06-08 08:47 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఎలాగైనా కమ్ బ్యాక్ అవ్వాలనే ఉదేశంతో మంచి కసి మీద సినిమా చేస్తున్నాడు. దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ దసరా కు రెడీ అవుతుంది. ఇది ఇలా ఉంటె.. డైరెక్టర్ త్రివిక్రమ్ నెక్స్ట్ చేసే సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒకటి వెంకటేష్ హీరోగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను రూపొందించే పనిలో ఉన్నాడు. ఇందులో వెంకీకి జోడిగా త్రిష నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నానితోనూ సినిమా...

అలానే నానితో ఓ సినిమా చేయనున్నాడనే వార్త వచ్చింది .. అది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. అయితే నాని సినిమాలో ఎవరు హీరోయిన్ అన్నది ఇంకా అనుకోలేదు. మరి ఈ రెండు సినిమాల్లో త్రివిక్రమ్ ముందుగా ఏ ప్రాజెక్టును మొదలెడతాడనే విషయమే ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా మాత్రం హారిక అండ్ హాసిని బ్యానర్ పై కాకుండా, బయట బ్యానర్ పై త్రివిక్రమ్ చేయనున్నాడని సమాచారం.

Similar News