ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కెపాసిటీ చూసారా?

Update: 2018-05-18 07:23 GMT

త్రివిక్రమ్ కి గత సినిమా అజ్ఞాతవాసి ఎలాంటి డిజాస్టర్ మిగిల్చినప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ లుక్ ని మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ ని చిత్ర బృందం విడుదలచెయ్యనుంది. డీజే భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనబడబోతున్నాడనే టాక్ ప్రచారంలో ఉంది. షూటింగ్ మొదలుపెట్టుకున్న కొద్దీ రోజులకే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ ని కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

రికార్డు ధరలకు యూఎస్ హక్కులు...

ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ టైటిల్, ఎన్టీఆర్ లుక్ మీద ఎన్టీఆర్ ఫాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మరో పక్క త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ యూఎస్ హక్కులు రికార్డు ధరకి అమ్ముడుకావడం హాట్ టాపిక్ గా మారింది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యుఎస్ హక్కులకు దాదాపుగా 12 కోట్లు పలికాయని అంటున్నారు. అయితే హారిక అండ్ హాసిని బ్యానర్ ఓనర్ రాధాకృష్ణ ఈ సినిమా తో పాటుగా తమ బ్యానర్ లో తెరకెక్కుతున్న సుధీర్ వర్మ - శర్వానంద్ ల సినిమాలను కలిపి ప్యాకేజ్ గా యుఎస్ హక్కులను 18 కోట్ల రూపాయలకు విక్రయించినట్లుగా తెలుస్తుంది.

దసరాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే....

అయితే శర్వానంద్ - సుధీరవర్మ ల సినిమాకి 6 కోట్ల లెక్కన, ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ 12 కోట్లు ముట్టినట్టు చెబుతున్నారు. మాములుగా త్రివిక్రమ్ సినిమా లకు ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ గత సినిమా ల ప్లాప్ ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ సినిమాకి 12 కోట్లు ఓవర్సీస్ హక్కులకు వచ్చాయని అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ సినిమా దసరాకి విడుదల చేయనున్నారు.

Similar News