త్రివిక్రమ్@ టైటిల్ త్యాగం!!

దర్శకుడు త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. అందమైన డైలాగ్స్ తో ప్రేక్షకుల మదిని దోచే దర్శకుడు త్రివిక్రమ్.ఇక త్రివిక్రమ్ మాటలే కాదు… ఆయన సినిమాలకు పెట్టె టైటిల్స్ కూడా [more]

Update: 2020-08-29 07:48 GMT

దర్శకుడు త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. అందమైన డైలాగ్స్ తో ప్రేక్షకుల మదిని దోచే దర్శకుడు త్రివిక్రమ్.ఇక త్రివిక్రమ్ మాటలే కాదు… ఆయన సినిమాలకు పెట్టె టైటిల్స్ కూడా ఆహ్లాదంగా ఆకట్టుకుంటాయి. చాలా డిఫ్రెంట్ గా కూల్ గా అనిపిస్తాయి. ఎక్కువగా అ సెంటిమెంట్ తోనే టైటిల్ పెట్టె త్రివిక్రమ్ చాలా రేర్ గా అ అక్షరాన్ని మారుస్తాడు. అతడు, …ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సామెత లాంటి టైటిల్స్ చాలా బావుంటాయి. ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ టైటిల్ కూడా అయినను పోయి రావాలె హస్తినకు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా త్రివిక్రమ్ తనదగ్గరున్న ఓ అద్భుతమైన టైటిల్ ని హీరో సత్య దేవ్ కి త్యాగం చేసాడట.

సత్య దేవ్ తమన్నా జంటగా క‌న్న‌డ‌లో హిట్ అయిన ల‌వ్ మాక్‌టైట్ కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కిస్తున్న సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ని ఖరారు చెయ్యడం అధికారిక ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించాడట. తన కొత్త సినిమాలకు ఆ టైటిల్ ఉంటుంది అన్న లెక్కలో త్రివిక్రమ్ ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించగా.. ఆ టైటిల్ మా సినిమాకి బావుంటుంది అని సత్యదేవ్ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చెయ్యడంతో త్రివిక్రమ్ ఆ టైటిల్ ని సత్య దేవ్ కి ఇచ్చేసినట్లుగా టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో  శీతాకాలం సూర్యుడిలా కొంచెం కొంచెం చూస్తావే అనే పాట స్ఫూర్తిగా ఈ గుర్తుందా శీతాకాలం టైటిల్ ని రిజిస్టర్ చేయించాడట త్రివిక్రమ్. ఇప్పుడు ఆ టైటిల్ ని సత్య దేవ్ కి త్యాగం చేసాడట త్రివిక్రమ్.

Tags:    

Similar News