త్రివిక్రమ్ ఇప్పుడు తెలుసుకున్నాడు..!

Update: 2018-10-09 07:15 GMT

సినిమాకి ప్రమోషన్స్ ఎంత అవసరమో ఈ మధ్య రిలీజ్ అయ్యే సినిమాలను బట్టి చెప్పొచ్చు. ఒక్కప్పుడు చాలా మంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ చేసేవారు కాదు. కానీ గత కొంత కాలం నుండి చాలామంది హీరోలు బయటికి వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా తెలియాలనే ఇలా ముందుకు వస్తున్నారేమో మరి. తన సినిమాలు రిలీజ్ అవుతుంటే అస్సలు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేశాడు. ఈ నెల 11న వరల్డ్ వైడ్ గా అతను దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్ కూడా టీవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. తెలుగులో ఉండే అన్ని న్యూస్ చానెల్స్ కి చాలా ఓపికగా ఇంటర్వూస్ ఇస్తున్నారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. యాంకర్స్ అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇస్తున్నారు.

అజ్ఞాతవాసి గురించి అడిగినప్పుడల్లా...

త్రివిక్రమ్ గత సినిమా ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం కొంచెం ఇబ్బందే. ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి చోట ఆయనను ఈ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. అయన కూడా దానికి సింపుల్ గా ఒకట్రెండు ముక్కల్లో ఆన్సర్ చెప్పి ‘అరవింద సమేత’ మీదకి వెళ్లిపోతున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ ప్రశ్న వచ్చినపుడల్లా ఇంవాల్వ్ అయ్యి హిట్లు, ఫ్లాపులు ఎవరికైనా సహజమని.. తాను కూడా చేదు అనుభవాలు చాలానే ఎదుర్కొన్నానని ఒక సినిమా ఫలితం బట్టి ఇంకో సినిమాను జడ్జ్ చేయకూడదు అని త్రివిక్రమ్ కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎప్పుడూ ఇంతలా ప్రమోట్ చేయని త్రివిక్రమ్ ఒకేసారి ఇలా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో అంతరార్థం ఏంటో తెలియడం లేదు.

Similar News