యాక్షన్ తర్వాత ఇద్దరూ లవ్ లో పడ్డారా..?

అల్లు అర్జున్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే దేశభక్తి కలగలిసిన యాక్షన్ మూవీ చేసాడు. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే [more]

Update: 2019-01-24 07:41 GMT

అల్లు అర్జున్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే దేశభక్తి కలగలిసిన యాక్షన్ మూవీ చేసాడు. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ దాదాపుగా ఎనిమిది నెలల గ్యాప్ తో మరో మూవీ చెయ్యడానికి సిద్దమయ్యాడు. ఇక త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో తన కెరీర్ లోనే మొట్టమొదటి పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అరవింద సమేత సినిమాని డైరెక్ట్ చేసాడు. త్రివిక్రమ్ ఎంటర్టైన్మెంట్ జోనర్ నుండి బయటికొచ్చి.. ఎన్టీఆర్ కి అనుకూలమైన యాక్షన్ సినిమాని చేసాడు. ఆ సినిమా యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో మొదలు పెట్టబోతున్నాడు. కథ విషయంలో కొలిక్కి రాక సినిమా మొదలు పెట్టడం లేట్ అవుతూ వచ్చింది. ముందుగా బాలీవుడ్ రీమేక్ ని త్రివిక్రమ్, అల్లు అర్జున్ నముకున్నారనే ప్రచారం జరిగింది. తర్వాత హాలీవుడ్ మూవీకి ఇన్స్పైర్ అయ్యి త్రివిక్రమ్, అల్లు అర్జున్ కథ ప్రిపేర్ చేస్తున్నాడన్నారు.

లవ్ స్టోరీతోనే…

కానీ అల్లు అర్జున్ తో తివిక్రమ్ మాత్రం ఫ్రెష్ లవ్ స్టోరీనే చేయబోతున్నాడని ప్రచారం కూడా జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఒక లవ్ స్టోరీనే చేస్తున్నాడట. ఇక ఆ లవ్ స్టోరీ కూడా కామెడీ గా, రొమాంటిక్ గా కంటే కూడా ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటుంది అని అంటున్నారు. మరి ప్రేమలో బాధను త్రివిక్రమ్ తన మార్క్ కామెడీతో ఈ సినిమాలో చూపించబోతున్నాడంటున్నారు. ఇంకా హీరోయిన్ ని ఎంపిక చెయ్యని.. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ బృందం.. కియారా అద్వానీ పేరు పరిశీలించినట్లుగా మొన్నామధ్యన ప్రచారం జరిగింది. మరి తాజాగా వినయ విధేయ రామ ఫ్లాప్ తరవాత కియారాకి అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిలింలో చోటుంతుందో లేదో తెలియదు.

Tags:    

Similar News