త్రివిక్రమ్ – బన్నీ ఇలా చేస్తున్నారెందుకు..?

నా పేరు సూర్య తరువాత చాలా నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ – బన్నీ ఈ [more]

Update: 2019-04-17 10:04 GMT

నా పేరు సూర్య తరువాత చాలా నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ – బన్నీ ఈ స్క్రిప్ట్ మీద చాలా రోజుల నుండి కూర్చున్నారు. ఈ నెల 24 నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతున్నట్టు టాక్. రీసెంట్ గా మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. అంతా బాగానే ఉంది కానీ సెకండాఫ్ స్క్రిప్ట్ రెడీ కాకుండానే సెట్ మీదకు వెళ్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. ఇప్పటికే ఆలస్యం అయినందున, బన్నీ వెనుక మరో రెండు కమిట్ మెంట్స్ ఉన్నందున రెడీగా ఉన్న ఫస్ట్ హాఫ్ తో వెళ్లిపోతున్నారు.

షూటింగ్ చేస్తూనే…

డైరెక్టర్ త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండుసార్లు మార్పులు చేర్పులు చేసుకున్నట్లు బోగట్టా. ఒక పక్క ఫస్ట్ హాఫ్ చేస్తూనే, దర్శకుడు త్రివిక్రమ్ సెకండాఫ్ స్క్రిప్ట్ డెవలప్ చేసి, ఫైనల్ నెరేషన్ ఇస్తారని తెలుస్తోంది. బన్నీ కూడా త్రివిక్రమ్ పై కాంఫిడెన్స్ గా ఉండటంతో ఓకే చెప్పాడట. ఈ సినిమా తరువాత బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు.

Tags:    

Similar News