తెలుగులో కూడా హీరోయిన్ ఓరియెంటెడేనా..?

Update: 2018-06-16 09:33 GMT

ప్రస్తుతం త్రిష కి స్టార్ హీరోలెవరు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడడం లేదు. గతంలో స్టార్ హీరోలందరితోనూ నటించిన త్రిష ప్రస్తుతం తనకున్న డిమాండ్ తగ్గిపోవడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ కాలం గడిపేస్తుంది. హీరోయిన్ గా ఫేడవుడ్ అయిన త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ గత ఐదారు నెలల నుండి కొన్ని వార్తలు మీడియా లో హల్ చల్ చేస్తున్నప్పటికీ.. త్రిష మాత్రం అపుడే పెళ్లేమిటి.. అయినా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం తమిళంలో నాలుగైదు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న త్రిష తెలుగు తెరకు ఎప్పుడో దూరమైంది.

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో...

తాజాగా త్రిష ఒక తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలొస్తున్నాయి. అది కూడా కుటుంబ కథా చిత్రాల స్పెషలిస్ట్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో త్రిష ఒక సినిమాకి ఓకె చెప్పినట్లుగా తెలుస్తుంది. సతీష్ వేగేశ్న దర్శకుడిగా శతమానం భవతి చిత్రం తో సూపర్ హిట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. తాజాగా అయన నితిన్ - రాశి ఖన్నా జంటగా శ్రీనివాస కళ్యాణం సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ కళ్యాణం సినిమా పూర్తి కాగానే సతీష్ వేగేశ్న.. త్రిష కథానాయికగా ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం కి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది.

కథ నచ్చి ఓకే చేప్పింది...

అయితే సతీష్ వేగేశ్న చెయ్యబోయే సినిమా కథ అంతా హీరోయిన్ చుట్టూనే తీరుతుందట, అందుకే త్రిష కూడా కథ నచ్చి సతీష్ వేగేశ్న ప్రపోజల్ ని ఓకె చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేస్తూ దూసుకుపోతున్న త్రిష ఇప్పుడు ఈ సినిమాతో తెలుగులో పేరు తెచ్చుకోవాలనుకుంటుందట. ఇకపోతే ఈ సినిమాని కె.ఎల్.నారాయణ నిర్మించనున్నట్లుగా తెలుస్తుంది.

Similar News