ఇంకెప్పుడు ప్రేమిస్తావ్ త్రిషా..?

Update: 2018-05-30 08:17 GMT

ఈమధ్యన సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. త్రిష కి ఇంతకుముందే పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుణ్ అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాల మీద దృష్టి పెట్టిన త్రిష పెళ్లి వార్తలు మళ్ళీ ఇన్నాళ్లకు హైలెట్ అయ్యాయి. త్రిష ప్రస్తుతం ఒక బిజినెస్ మ్యాన్ తో లవ్ ఎఫైర్ నడపడమే కాదు... అతనితో పెళ్ళికి కూడా రెడీ అయ్యిందని.. అందుకే విదేశాల్లో త్రిష పెళ్లి షాపింగ్ ఒక రేంజ్ లో చేస్తుందనే న్యూస్ గత నెల రోజులుగా వినబడుతుంది. అయితే ప్రస్తుతం తన పెళ్లి వార్తలపై స్పందించింది త్రిష.

ప్రేమిస్తే నేనే చెబుతాను...

గత కొంతకాలంగా నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. అసలు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అలాగే నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు. కానీ నేను మాత్రం ఎవరినైనా ఇష్టపడి ప్రేమించే పెళ్లి చేసుకుంటాననని.. కానీ ఇంతవరకు నాకు నచ్చిన వ్యక్తి తారసపడలేదు. అదే జరిగితే అందరికీ నేనే స్వయంగా చెబుతాను.. అంటూ తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. కానీ ఇప్పుడు ఇంత వయసొచ్చేసాక కూడా ఇంకా ప్రేమ, పెళ్లి అంటూ ఉండడం.. అందులోనూ ఇప్పటివరకు ప్రేమలో పడని త్రిష ఇంకా ఇప్పుడేం పడుతుంది.. అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

ఇంకెప్పుడు చేసుకుంటుంది...

ప్రస్తుతం కోలీవుడ్ లో లేడి ఓరియెంట్ సినిమాలతో.. బిజీగా వుంది త్రిష . కెరీర్ లో ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే త్రిష కి క్రేజ్ ఎప్పుడో పోయింది. మరి ఇలాంటి టైం లో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వక.. ఇంకా ప్రేమలో పడి ఎప్పుడో పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. కాస్త హాస్యాస్పదం అంటున్నారు నెటిజెన్లు.

Similar News