మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరోయిన్..!

Update: 2018-10-05 09:40 GMT

తెలుగులో దాదాపు 10 ఏళ్లు హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన త్రిష చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళంలో గత కొంత కాలం నుండి హిట్ కోసం ఎదురు చేస్తున్న త్రిష కు రీసెంట్ గా '96' అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. ఆ మధ్య త్రిష హార్రర్ ట్రెండ్ లో భాగంగా 'మోహిని', 'నాయకి' అంటూ రెండుసార్లు ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఈసారి ట్రెండ్ మార్చి ఓ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. '96' సినిమా నిన్ననే విడుదల అయ్యి అన్ని ఏరియాస్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు. సమంత, నానిలు ఈ సినిమాలో నటించే అవకాశముందని తెలుస్తుంది. '96' మీనింగ్ ఎడమొహం.. పెడమొహం అని.

త్రీ జనరేషన్స్...

ఇందులో త్రిష, విజయ్ లు త్రీ జెనరేషన్స్ లో కనిపించనున్నారు. ఒక్కప్పుడు తెలుగులో, తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష వరస ఫ్లాప్స్ తో కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో అనుకున్న స్థాయిలో విజయాలు దక్కలేదు. కానీ నిన్న రిలీజ్ అయిన '96' తో తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది త్రిష.

Similar News