ఇంకా కలలోనే ఉన్నట్లుగా ఉందట ఈ హీరోయిన్ కి

Update: 2018-08-21 03:16 GMT

ఈమధ్యన హీరోయిన్ త్రిష కి ఒక్క హిట్ కూడా లేదు. ఎలాగూ స్టార్ హీరోయిన్ చైర్ నుండి ఎప్పుడో దిగిపోయింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రావడం లేదు. అందుకే కళావతి, నాగిని, మోహిని అంటూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కాలం గడుపుతుంది. అలా అని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోను త్రిష హిట్స్ ఏమి కొట్టడం లేదు. అయితే పెద్దగా హీరోల సరసన ఛాన్స్ లు రాని టైం లో ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. అదికూడా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసింది త్రిష. రజినీకాంత్ పక్కన ఐశ్వర్య రాయ్ వంటి వారు నటించినా గత కొంత కాలంగా ఆయన పక్కన నటించే హీరోయిన్స్ విషయంలో దర్శకనిర్మాతలు ఎంత లైట్ తీసుకుంటున్నారో... కబాలి, కాలా సినిమాలు చూస్తే తెలుస్తుంది.

అయితే ర‌జ‌నీకాంత్ – కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో రజినీకాంత్ కి జోడిగా త్రిష‌ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మరి వెండితెర మీద వీరిద్ద‌రి జోడీ చూడ‌డం ఇదే తొలిసారి. ఇంతకుముందు సీనియర్ నటి సిమ్రాన్ రజినీకాంత్ కి జోడిగా ఈ సినిమాలో నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే సిమ్రాన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా.... ఆ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉంటుందనే టాక్ వుంది. అలాగే ఈ సినిమాలో సిమ్రానే విలన్ అని కూడా అంటూంబ్నారు. ఇక త్రిష మెయిన్ హీరోయిన్ గా ఉంటుందట. ఎలాగూ ఫామ్ కోల్పోతున్న టైం లో త్రిష కి ఇలా సూపర్ స్టార్ పక్కన అవకాశం తగలడం కాస్త లాభదాయకమైన విషయమే అని చెప్పాలి.

ఇకపోతే ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు - రజినీకాంత్ ల చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమాలో కీలకమైన క్లయిమాక్స్ సీన్స్‌ని మదురైలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. ఇక హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసిన తర్వాత త్రిష ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవడమే కాదు.. సూపర్ స్టార్ సరసన తనకొచ్చిన అవకాశాన్ని చూసి మురిసిపోతూ... కొన్నిసార్లు నిద్ర లేచిన తర్వాత కూడా ఇంకా కలలోనే ఉన్నట్టు అనిపిస్తుందంటూ రజిని పక్కన ఛాన్స్ రావడంతో ఆ సంతోషాన్ని అలా ట్వీట్ రూపంలో బయటపెట్టింది.

Similar News