త్రిష బ్యాక్ టు ఫామ్

తెలుగు లో ఒకప్పుడు చిన్న హీరో నుండి స్టార్ వరకు అందరితో నటించిన త్రిష తన కెరీర్ ముగింపు దశలో ఆమెకు తమిళంలో సూపర్ హిట్ చిత్రం [more]

Update: 2019-10-19 07:17 GMT

తెలుగు లో ఒకప్పుడు చిన్న హీరో నుండి స్టార్ వరకు అందరితో నటించిన త్రిష తన కెరీర్ ముగింపు దశలో ఆమెకు తమిళంలో సూపర్ హిట్ చిత్రం 96 వచ్చింది. దాంతో త్రిష కెరీర్ ఊపందుకుంది. 96 చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమెకు తెలుగు, తమిళ బాషల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోస్, పెద్ద హీరోస్ అని తేడా లేకుండా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే త్రిష మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఓకే చేస్తుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మణిరత్నం చేస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈచిత్రం లో త్రిష ఒక రోల్ చేస్తుంది. మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మొహాన్ లాల్ హీరోగా చేయనున్న సినిమాలో కూడా త్రిష నటించనుంది. ఇక తెలుగు లో ఈమె చిరంజీవి – కొరటాల సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టు టాక్.

ఇంకా రెండుమూడు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. ఈసినిమాలో రెండు హిట్లు గనుక పడితే ఆమె వెనక్కి తిరిగి చూసుకునే పరిస్తితి ఉండదు.

Tags:    

Similar News