ఒక్క సినిమా కాదన్నా అని తెలుగునే వదిలేస్తానా?

తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన త్రిష.. సీనియర్ అండ్ యంగ్ హీరోలందరిని చుట్టేసింది. అయితే తాజాగా చిరు సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో… ఆమెపై మెగా [more]

Update: 2020-03-26 06:22 GMT

తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన త్రిష.. సీనియర్ అండ్ యంగ్ హీరోలందరిని చుట్టేసింది. అయితే తాజాగా చిరు సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో… ఆమెపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. పాత్ర నచ్చలేదని అన్నయ్య సినిమా నుండే వాకౌట్ చేస్తావా అంటూ త్రిషపై నిప్పులు చెరుగుతున్నారు. అందుకే త్రిషపై మెగా ఫ్యాన్స్ లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు,. అందులో భాగంగానే త్రిష ఇక తెలుగులో నటించదు అందుకే చిరు సినిమానుండి తప్పుకుంది అంటూ ఆమెపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారట.

ఆ ప్రచారం విషయం తనదాకా రావడమతొ త్రిష వాళ్ళ మీద ఫైర్ అవుతుంది. దానితో త్రిష నేను హీరోయిన్ గా నిలదొక్కుకున్నదే తెలుగు సినిమాలతో. ఇక్కడ తెలుగు హీరోలందరితో సినిమాలు చేశాను అలాంటప్పుడు నేను తెలుగు సినిమాలు చేయనని ఎందుకు చెబుతాను. మొన్నామధ్యన టాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పాను. అంతేకాని.. తెలుగులో సినిమాలు చెయ్యనని చెప్పలేదు. అంతలోనే త్రిష తెలుగులోనే చేయదట అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పుకారు మాత్రమేనని చెప్పడమే నా ఉద్దేశం. అంటూ ఫైర్ అవుతుంది త్రిష.

Tags:    

Similar News