చిరు కి హ్యాండ్.. ప్లాప్ హీరోకి గ్రీన్ సిగ్నల్ ..?

చిరు – కొరటాల ఆచార్య సినిమా షూటింగ్ కొంతమేర చిత్రీకరణ జరిగిన తర్వాత ఆ సినిమా హీరోయిన్ త్రిష కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా [more]

Update: 2020-04-24 02:20 GMT

చిరు – కొరటాల ఆచార్య సినిమా షూటింగ్ కొంతమేర చిత్రీకరణ జరిగిన తర్వాత ఆ సినిమా హీరోయిన్ త్రిష కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక చిరు మాత్రం మణిరత్నం సినిమాలో త్రిష డేట్స్ అడ్జెస్ట్మెంట్స్ లేక ఆచార్య ని వదులుకుంది అని చెప్పాడు. మళ్లీ ఆచార్య సెట్స్ లో ఓ కీలక వ్యక్తి త్రిష తో మిస్ బిహేవ్ చేసాడు కాబట్టే త్రిష తప్పుకుంది అన్నారు. అయితే ఏది ఏమైనా త్రిష ఆచార్య నుండి తప్పుకోవడం మాత్రం సంచలనం అయ్యింది.

మరి చిరు లాంటి మెగాస్టార్ కి హ్యాండ్ ఇచ్చిన త్రిష తాజాగా తెలుగులో ప్లాప్ హీరోగా వరస డిజాస్టర్స్ తో ఉన్న రవితేజ సినిమాని త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి త్రిష మణిరత్నం సినిమా కోసం ఆచర్యని వదిలేస్తే.. రవితేజ సినిమా ఎలా ఒప్పుకుంది? ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. మరి చిరు కి తెలియకుండా ఆచార్య సెట్స్ లో త్రిష నిజంగానే ఇబ్బంది పడింది అనేది వాస్తవమని అనిపిస్తుంది. ఇక త్రిష రవితేజ – రమేశ్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లుగా న్యూస్ అయితే ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. 

Tags:    

Similar News