ఎక్కువ పైరసీ అయిన తెలుగు సినిమాలు ఇవే

Update: 2018-07-06 10:10 GMT

పైరసీ భూతం భారత సినీ ఇండస్ట్రీని ఎంతగా కుదిపేస్తోందో తెలిసిందే. సినిమా విడుదలకు ముందే కొన్ని వెబ్ సైట్లు సినిమా పైరసీ కాపీని అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో లక్షల సంఖ్యలో ఈ పైరసీ సినిమాలను డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు కొందరు ప్రేక్షకులు. దీంతో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాల కలెక్షన్లకు భారీ గండి పడుతోంది. అయితే, తెలుగు, తమిళ ఇండస్ట్రీలు పైరసీ నియంత్రణకు పలు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, 2018లో ఇప్పటివరకు ఎక్కువ పైరసీకి గురైన సీనిమాల జాబితా, ఎంత మంది డౌన్ లోడ్ చేసుకున్నారో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది.

టాప్ లో భాగమతి, రంగస్థలం

జర్మనీకి చెందిన టెక్సిపికో సంస్థ గత ఆరేళ్లుగా పైరసీ వెబ్ సైట్లను పరిశీలిస్తోంది. ఈ సంస్థ తాజాగా తెలుగు సినిమాల పైరసీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఈ సంవత్సరం ఎక్కువ పైరసీ అయిన సినిమాల్లో అనుష్క నటించిన భాగమతి 19 లక్షల పైరసీ డౌన్ లోడ్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రంగస్థలం సినిమాను 16 లక్షల మంది డౌన్ లోడ్ చేయడం ద్వారా రెండో స్థానంలో ఉంది. భారత్ లో ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నుంచి పైరసీ సినిమాల కోసం డిమాండ్ ఉందని ఈ సంస్థ పేర్కొంది.

మరిన్ని తెలుగు సినిమాలు - పైరసీ డౌన్ లోడ్లు

భరత్ అనే నేను - 16,13,404

మహానటి - 14,99,064

నా పేరు సూర్య - 12,60,708

తొలిప్రేమ - 10,07,922

ఛలో - 8,42,475

అజ్ఞాతవాసి - 8,28,684

జైసింహ - 8,10,964

టచ్ చేసి చూడు - 7,67,875

Similar News