కృష్ణం రాజుగారు బాగానే ఉన్నారు

గత కొన్నాళ్లుగా కృష్ణం రాజు.. అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. అందుకే సరిగా నడవలేకపోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కొన్ని ఈవెంట్స్ కి హాజరైనాడు కూడా కృష్ణంరాజు కాస్త స్లోగానే, [more]

Update: 2019-11-14 06:51 GMT

గత కొన్నాళ్లుగా కృష్ణం రాజు.. అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. అందుకే సరిగా నడవలేకపోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కొన్ని ఈవెంట్స్ కి హాజరైనాడు కూడా కృష్ణంరాజు కాస్త స్లోగానే, బాగా వెయిట్ పెరిగి కనిపించేసరికి ఆ రూమర్స్ నిజమనుకున్నారు. తాజాగా కృష్ణం రాజు నిమోనియా తో బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, ఆయనకు ఆరోగ్యం బాగోలేదని.. అందుకే హాస్పిటల్ లో ఉన్నారని గత రెండు రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ కృష్ణం రాజు ఆరోగ్యం బాగానే ఉందని రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అయన కేర్ కి వెళ్లారని చెప్పినా కృష్ణ రాజు ఆరోగ్యంపై న్యూస్ లు సోషల్ మీడియాలో ఆగలేదు.

అందుకే కృష్ణం రాజు పిఆర్ టీం కృష్ణరాజు హెల్త్ కండిషన్ పై క్లారిటీ ఇచ్చింది. కృష్ణంరాజు గారు…చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్త కరెక్ట్ కాదు. నిమోనియా వస్తే చెకప్ కోసం కేర్ కు వెళ్లారు. దయచేసి కృష్ణం రాజుగారి మీద ఎలాంటి స్క్రోలింగులు పెట్టకండి… అంటూ ఆయన పిఆర్ టీం ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చింది.

Tags:    

Similar News