థియేటర్స్ ఓపెన్ కావని ఫిక్స్ అయ్యారా?

ఎప్పుడెప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయా? ఎప్పుడెప్పుడు సినిమాలు విడుదల చెయ్యాలా? అని చాలామంది నిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. కేంద్రం కూడా థియేటర్స్ ఓపెనింగ్ పై గట్టి కసరత్తే చేస్తుంది. [more]

Update: 2020-09-17 06:57 GMT

ఎప్పుడెప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయా? ఎప్పుడెప్పుడు సినిమాలు విడుదల చెయ్యాలా? అని చాలామంది నిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. కేంద్రం కూడా థియేటర్స్ ఓపెనింగ్ పై గట్టి కసరత్తే చేస్తుంది. అన్ లాక్ 5.0 లో ఏమైనా థియేటర్స్ ఓపెన్ చేస్తామని చెబుతారని చూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం థియేటర్స్ తెరుచుకున్నా వెస్ట్ జనాలు థియేటర్స్ కి రారని ఫిక్స్ అయినట్లుగా కనబడుతుంది వ్యవహారం. నిన్నమొన్నటి వరకు ఓటిటి అంటే ఆగ్రహించిన వారే ఒక్కొక్కరిగా ఓటిటి బాట పడుతున్నారు. నాని వి, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా ఇలానే ఓటిటి బాట పట్టాయి.

తాజాగా మరో చిన్న సినిమా కలర్ ఫోటో అక్టోబర్ లో అహ ద్వారా విడుదల కాబోతుంది. ఇక నిన్నటివరకు సినిమా థియేటర్స్ లోనే అన్న అనుష్క అండ్ నిర్మాతలు ఇప్పుడు నిశ్శబ్దాన్ని ఓటిటికి అమ్మేశారని.. ఇక రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అనే టాక్ నడుస్తుంది. మిగిలిన ఉప్పెన, రామ్ రెడ్ లు ఓటిటి విషయంలో బెట్టు చేస్తూనే ఉన్నాయి. దసరా కి బొమ్మ పడుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇక దసరా కి బొమ్మ పడినా కరోనా టీకా వచ్చేవరకు ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ లేదని.. అందుకే ఒక్కోక్కరిగా ఓటిటి జై కొడుతున్నారనే టాక్ నడుస్తుంది.

Tags:    

Similar News