ఏప్రిల్ అదరగొట్టిందే..!

టాలీవుడ్ లో ఈ ఏడాది ఓపెనింగ్ నుండి నెలకో సినిమా మాత్రమే హిట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలైనా, చిన్న చిత్రాలైనా మంచి అంచనాలతో బాక్సాఫీసు వద్దకు [more]

Update: 2019-05-01 06:54 GMT

టాలీవుడ్ లో ఈ ఏడాది ఓపెనింగ్ నుండి నెలకో సినిమా మాత్రమే హిట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలైనా, చిన్న చిత్రాలైనా మంచి అంచనాలతో బాక్సాఫీసు వద్దకు వచ్చినా చాలా సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు. జనవరిలో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తో సరిపెట్టుకున్న ప్రేక్షకులు.. ఫిబ్రవరిలో ఒక్క సినిమా కూడా సంతృప్తి పర్చలేకపోయింది. ఇక మార్చిలో 118 తప్ప ప్రేక్షకులను పడేసిన సినిమా ఒక్కటి లేదు. కానీ ఏప్రిల్ మొదలైంది మొదలు… హిట్స్ తో టాలీవుడ్ కళకళలాడిపోతుంది. ఏప్రిల్ 5న నాగ చైతన్య – సమంత – దివ్యంకా కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకుల కరువు తీర్చేసింది. సమంత శ్రావణిగా, చైతు పూర్ణ పాత్రలో నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అన్ని సినిమాలూ హిట్..!

ఆ తర్వాత ఏప్రిల్ 12 న సాయి తేజ్ – కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురేజ్ చిత్రలహరి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది. ఇక ఏప్రిల్ 19న నాని జెర్సీతో బాక్సాఫీసుని అల్లాడించాడు. గౌతమ్ తిన్నసూరి డైరెక్షన్ లో నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా నటించిన జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. క్రికెట్ ని, మధ్యతరగతి జీవితాన్ని గౌతమ్ తిన్నసూరి బ్యాలెన్సుడ్ గా చూపించిన తీరుకి ప్రేక్షకులు పడిపోయారు. మరి జెర్సీకి పోటీగా రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 కూడా బాక్సాఫీసు బరిలోకి దిగింది. ఇక కాంచన 3 నెగెటివ్ టాక్ తోనే 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏప్రిల్ చివరి వారంలో విడుదలై సునామిలా భారీ హిట్ అయ్యింది. ఇప్పటికీ అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా కొనసాగుతుంది. మరి ఏప్రిల్ విడుదలైన సినిమాల్ని ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాయి. అలాగే ఆయా హీరోలు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.

Tags:    

Similar News