ఈ సమ్మర్ ఒకే ఒక్క స్టార్ హీరోదా..?

గత ఏడాది సమ్మర్ లో అంటే మార్చి 30న రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బోణి కొట్టాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మార్చి [more]

Update: 2019-03-01 07:41 GMT

గత ఏడాది సమ్మర్ లో అంటే మార్చి 30న రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బోణి కొట్టాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మార్చి నెలాఖరున కూల్ గా వచ్చి అదరగొట్టే హిట్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక ఏప్రిల్ లో మహేష్ బాబు – కొరటాల శివ కాంబోలో క్రేజీగా తెరకెక్కిన భరత్ అనే నేను కూడా హిట్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు కానీ.. నార్మల్ హిట్ అయ్యింది ఆ సినిమా. ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ మే మొదటి వారంలోనే నా పేరు సూర్యతో హడావిడి చేసాడు కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ముగ్గురు స్టార్ హీరోలు గత ఏడాది సమ్మర్ లో పోటీ పడితే… ఈ ఏడాది సమ్మర్ కేవలం ఒకే ఒక్క స్టార్ హీరోకి సొంతం కానుంది

మళ్లీ మహేష్ బాబు మాత్రమే…

అది కూడా మహేష్ బాబుకి మాత్రమే. ఈ ఏడాది టాప్ స్టార్ ల సినిమాల్లో కేవలం మహేష్ బాబు మాత్రమే ఈ వేసవిని ఉపయోగించుకొనున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకురారు. వారు నటిస్తున్న #RRR సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇక అల్లు అర్జున్.. నా పేరు సూర్య దెబ్బకి ఏడాది గడిచినా కొత్త సినిమా మొదలుపెట్టడం లేదు. ఇక ప్రభాస్ సాహో.. ఆగస్టు 15న, చిరంజీవి సైరా సినిమా కూడా ఆగస్టులోనే విడుదల అవుతుంది అంటున్నారు కానీ దసరాకే పక్కా అవుతుందనిపిస్తుంది.

మహర్షిపై మంచి అంచనాలు…

మరి వేసవిలో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవడం అనేది సహజం. కానీ ఈసారి స్టార్ హీరోలంతా వేసవిని వదిలేశారు. వేసవి సెలవుల్లో భారీ బడ్జెట్ సినిమాలను వదిలి బాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు చాలామంది దర్శకనిర్మాతలు. మరి ఈసారి మహేష్ బాబు మహర్షి సినిమాతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి సినిమా మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Tags:    

Similar News