మార్చి టాలీవుడ్ రిపోర్ట్..!

అన్ సీజన్ అంటూ మార్చి నెలలో సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గరికి రావడానికి మొగ్గు చూపలేదు. వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయాయి. మార్చి 1న కళ్యాణ్ రామ్, [more]

Update: 2019-04-02 07:00 GMT

అన్ సీజన్ అంటూ మార్చి నెలలో సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గరికి రావడానికి మొగ్గు చూపలేదు. వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయాయి. మార్చి 1న కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే జంటగా నటించిన 118 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.. నిర్మాత సేఫ్. కానీ ఓ అన్నంత హిట్ కాలేదు. ఇక ఫిబ్రవరిలో ఒక్క సినిమా కూడా లేక బోర్ కొట్టిన ప్రేక్షకుడికి 118 కాస్త ఊరటనిచ్చింది. ఇక మార్చ్ 8న ఏ సినిమా బాక్సాఫోసు వద్దకు వచ్చిందో కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు.

చిన్న సినిమాలే రావడంతో…

ప్రేక్షకులకు పరిచయం ఉన్న సినిమాలేవీ లేకపోవడం.. ఇక తర్వాతి వారం అంటే మార్చ్ 15న జెస్సీ అనే థ్రిల్లర్ సినిమాతో పాటు వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి, పులి జూదం అనే డబ్బింగ్ సినిమాతో పాటు ప్రేమ అంత ఈజీ కాదురా, వినర సోదర వీర కుమార ఇలా అన్ని చిన్న సినిమాలే బాక్సాఫీసు దగ్గర పోటీ పడ్డాయి. ఇక తమిళం నుండి నయనతార హీరోయిన్ గా ఐరా అనే మూవీ కూడా వచ్చింది. అది కూడా ఫ్లాప్. మరి మార్చి చివరి వారంలో పోటీ పడ్డ లక్ష్మీస్ ఎన్టీఆర్, నిహారిక సూర్యకాంతం సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం సినిమాలు ప్రమోషన్స్ తో దూసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. మార్చి నెలలో కేవలం 118 మూవీ ఒక్కటే హిట్ మూవీగా నిలవగా మిగతా సినిమాలన్నీ హుష్ కాకి అయ్యాయి.

Tags:    

Similar News