టాలీవుడ్ ని కలవరపెడుతున్న లీకుల గోల

Update: 2018-08-12 04:09 GMT

టాలీవుడ్ అయినా ఏ భాష అయినా.. సినిమా షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే.. అవి పిక్స్ రూపంలోనో .. మారేదన్నా కానివ్వండి యూనిట్ సభ్యులకు తెలియకుండా బయటికి లీకవడం అంటే.. అది ఎంత పెద్ద షాక్ తెలియంది కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్ట్ లు ఇలా లీకుల టెన్సన్స్ లో కొట్టుకుపోతున్నాయి. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న సినిమాలకు ఈ లీకులు అనేవి పెద్ద తలనొపిగా మారాయి. ఇలా చిత్ర బృందం అనుమతి లేకుండా సినిమాలోని పిక్స్ గాని సినిమాలోని సీన్స్ గాని యూట్యూబ్ లోకొచ్చేస్తే నిర్మాత ఎంతగా నష్టపోతాడో తెలియంది కాదు. ఈమధ్యన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అరవింద సామెత - వీర రాఘవ సినిమాలోని పిక్స్ వరసబెట్టి లీకవుతూ సోషల్ మీడియాలో తాండవం చేస్తున్నాయి. మరి ఇలా కొంతమంది ముఠా గా ఏర్పడి సినిమా షూటింగ్ స్పాట్ నుండి లీక్ చేస్తూ దర్శక నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అప్పుడప్పుడు కొంతమంది లీకుల రాయుళ్లను పట్టుకున్నప్పటికీ... ఈ సైబర్ నేరగాళ్లు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు.

తాజాగా హైదరాబాద్ లో ఒక సైబర్ మూట గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీస్ లు. భారీ పైరసీ ముఠాలోని రాజేష్ అనే ఎడిటర్‌ని అరెస్ట్ చేసి.. అతడి దగ్గరనుంచి ఒక హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హార్డ్ డిస్క్ చెక్ చెయ్యగా... పోలీస్ లకు షాకింగ్ విషయాలు తెలిశాయట. ఆ హార్డ్ డిస్క్ లో అనేక సినిమాలతో పాటుగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రెండు భారీ ప్రాజెక్టుల ఫుటేజ్ అందులో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి ఆ రెండు ప్రాజెక్టులు అరవింద సామెత, మహర్షి అయి ఉంటాయనే అనుమానం ఇప్పుడు అందరిలో మొదలైంది. మరి రా ఫుటేజ్ నే వారు హార్డ్ డిస్క్ లలో నింపేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటే... ఈ పైరసీ ఏ రేంజ్ లో వెళ్ళనుకుని పోయిందో తెలుస్తుంది.

ఇకపోతే పోలీస్ లు ఆ హార్డ్ డిస్క్ ఐపీ అడ్రస్ ట్రేసవుట్ చెయ్యగా... అందులో గుంటూరు వీఐజేటీ కాలేజీకి చెందిన 17 మంది విద్యార్థులలు ఉన్నల్టుగా పోలీస్ లు వారిని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ ముఠాలో మరికొంతమంది అరెస్ట్ లు జరిగే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై టాలీవుడ్ లో కలవరం మొదలైంది.

Similar News