టాలీవుడ్ పెళ్లిళ్ల సంగతి ఏమైంది!

Update: 2018-08-11 07:53 GMT

గత పదిహేను రోజులుగా టాలీవుడ్ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. ఏ డైరెక్టర్ కొడుకో, ఏ నిర్మాత కూతురి పెళ్లో అనుకునేరు. కాదండి.. టాలీవుడ్ లో విడుదలైన పెళ్లి సినిమాలు టాలీవుడ్ లో వారానికో పెళ్లి అన్నట్టుగా విడుదలవుతున్నాయి. ముందుగా మెగా డాటర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్ తో వచ్చింది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నిహారిక మీద భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ హ్యాపీ వెడ్డింగ్ టాక్ తుస్ మనేసరికి సినిమా ప్లాప్ అయ్యి కూర్చుంది. కనీసం సినిమా విడుదలయ్యాక ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదంటే సినిమా ఎంతగా ప్లాప్ అయ్యిందో చిత్ర బృందానికి కూడా అర్ధం అయింది. ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమా సాక్ష్యం సినిమా హడావిడిలో కొట్టుకుపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సాక్ష్యం సినిమా హిట్ కాకపోయినా... హ్యాపీ వెడ్డింగ్ మీద పర్వాలేదనిపించింది. ఇక గత శుక్రవారం సుశాంత్ హీరోగా రుహని హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమా డీసెంట్ హిట్ అయ్యింది. సినిమా హిట్టే కానీ.... ఆపరేషన్ సక్సెస్ కానీ పేషేంట్ డెడ్ అన్నట్టుగా... చి.ల.సౌ సినిమా హిట్ అయ్యింది కానీ పాపం కలెక్షన్స్ రావడం లేదు.

మూడింట్లో ఒక్కటే హిట్..!

సినిమాని ఎంతగా ప్రమోట్ చేసినా... చి.ల.సౌ సినిమా కి కలెక్షన్స్ రావడం లేదు. ఆన్లైన్ ప్రమోషన్స్ అంటూ రాహుల్ అండ్ బ్యాచ్ తెగ హడావిడి చేసినా అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా హిట్ లో చి.ల.సౌ కొట్టుకుపోయింది. అదేగనక చి.ల.సౌ సోలోగా బరిలోకి వచ్చినట్లయితే...ఖచ్చితంగా చిన్న సినిమాగా వచ్చి చి.ల.సౌ హిట్ ఖాయమయ్యేది... కలెక్షన్స్ భారీగా కొల్లగొట్టేది. పాపం సుశాంత్ . ఇక తాజాగా నిన్న శుక్రవారం విడుదలైన నితిన్ - రాశి ఖన్నా ల శ్రీనివాస కళ్యాణం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. సినిమాలో సోది తప్ప మరేం లేదంటున్నారు. పెళ్లి కేసెట్ చూసిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు. మరి ఈ టాలీవుడ్ లో వచ్చిన మూడు పెళ్లిళ్లలో.. హ్యాపీ వెడ్డింగ్ ప్లాప్ కాగా.. చి.ల.సౌ హిట్ అవగా...శ్రీనివాస కళ్యాణం మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అదన్నమాట టాలీవుడ్ పెళ్లిల్లగోల.

Similar News