టాలీవుడ్ చాలు అంటున్న మహేష్

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ రేంజ్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. మహేష్ సినిమాకి ఉండే డిమాండ్ మరే సినిమాలకు ఉండదంటే నమ్మాలి. రాజమౌళి సినిమాల తర్వాత [more]

Update: 2019-04-04 09:54 GMT

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ రేంజ్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. మహేష్ సినిమాకి ఉండే డిమాండ్ మరే సినిమాలకు ఉండదంటే నమ్మాలి. రాజమౌళి సినిమాల తర్వాత ఇక్కడ మహేష్ సినిమాలకే అంత భారీ క్రేజ్ ఉంటుంది. ఇక్కడ భారీ క్రేజ్ ఉన్న మహేష్ బాబు గతంలో బాలీవుడ్ కి వెళుతున్నాడని.. మహేష్ కి ఒక బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ చెయ్యాలని ఉండేదని ప్రచారం జరిగింది. ఇక మహేష్ అభిమానులు కూడా మహేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మహేష్ బాలీవుడ్ లో సినిమా చేస్తానని కానీ.. చెయ్యనని కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే ఇక్కడ క్రేజ్ సంపాదించాక బాలీవడ్ కి వెళతాడని.. కథ, మంచి డైరెక్టర్ దొరికితే త్వరలోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలామంది అనుకున్నారు.

టాలీవుడ్ లోనే ఉంటాను…

కానీ మహేష్ మాత్రం టాలీవుడ్ చాలు, బాలీవుడ్ మనకెందుకు అంటున్నాడు. చాలామంది హీరోలు టాలీవడ్ లో సూపర్ హిట్ అయ్యాక బాలీవుడ్ వైపు చూస్తుంటే మహేష్ బాలీవుడ్ మనకెందుకు అంటున్నాడు. తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్… ‘‘బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ మధ్యన మన సౌత్ సినిమాలే అద్భుతమైన భారీతనంతో వస్తున్నాయి. రాజమౌళి లాంటి డైరెక్టర్ బాహుబలితో సౌత్ లో మంచి కతతో సినిమా చేస్తే ఎంతగా హిట్ అవుతాయో నిరూపించాడు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సౌత్ సినిమాపైనే. సౌత్ లోనే మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను’’ అంటూ బాలీవుడ్ పై తన అభిప్రాయాన్ని చెప్పాడు.

Tags:    

Similar News