టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఇదేనా..?

Update: 2018-05-29 09:18 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రెండ్ ఫార్ములా నడుస్తుంది. అదే హీరోల్లో ఏదొక లోపం ఉందటం. ఈమధ్య ఇటువంటి సినిమాలు చాలా ఎక్కువ అయ్యిపోయాయి. మారుతీ డైరెక్ట్ చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమాలో నానికి మతి మరపు ఉండటం దగ్గర నుండి మొన్న వచ్చి ఇండస్ట్రీ ని షేక్ చేసిన 'రంగస్థలం' సినిమాలో చరణ్ కు చెవిటి లోపం, 'నా పేరు సూర్య' హీరోకు షార్ట్ టెంపర్ ఇలా చాలానే సినిమా వచ్చాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే 'రాజుగాడు'లో రాజ్ తరుణ్ దొంగతనాలు చేసే బలహీనత, 'అభిమన్యుడు'లో విశాల్ కు అతి కోపం ఇలా వరసబెట్టి ఇలాంటివే వస్తున్నాయి.

ట్రెండ్ సెట్టర్ మాత్రం కమలే..

ఇదేదో మారుతీ కనిపెట్టిన ఫార్ములా కాదు కమల్ హాసన్ సినిమాల్లో ఇటువంటి లోపాలు చాలానే చూశాం. 'అమావాస్య చంద్రుడు'లో కళ్లు లేని వ్యక్తిగా, 'స్వాతి ముత్యం'లో మానసికంగా ఎదుగుదల లేనివాడిగా, 'విచిత్రసోదరులు'లో మరుగుజ్జుగా ఇలా చాలానే వేసాడు. అయితే వీటిలో కొన్ని హిట్ అయ్యాయి మరి కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలా అని చెప్పి అన్ని ఇదే కోవలో తీసుకుంటూ పోతే హిట్టు కొట్టే తీరతాం అన్న గ్యారెంటీ లేదు.

రాజ్ తరుణ్ మళ్లీ అదే ఫర్ములా...

ఈమధ్య రాజ్ తరుణ్ 'అందగాడు' అనే సినిమాలో గుడ్డివాడిగా నటిస్తే సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే మళ్లీ రాజ్ తరుణ్ అదే ఫార్ములా ని యూజ్ చేసి 'రాజుగాడు' సినిమాతో మన ముందుకు రావడం గమనార్హం. ఇక షూటింగ్ దశలో ఉన్న నాగ చైతన్య 'సవ్యసాచి'లో హీరోకు తన కుడి చేయి ఆధీనంలో ఉండకపోవడం అనే వీక్ నెస్ ఉంటుంది. వెంకీ - వరుణ్ తేజ్ ల ఎఫ్2లో ఇద్దరికి ఒక్కో లోపం సెట్ చేసాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మొత్తానికి మన హీరోలు లోపాలతో విజయాలు అందుకుంటూనే ఉన్నారు కానీ సీజన్ లాగా ఇది ఎక్కడో ఒక చోట ఆగటం అయితే ఖాయం.

Similar News