గో బ్యాక్ అంటారా.. ఏమిటి..!

Update: 2018-11-17 07:34 GMT

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. అంతేకాదు మహేష్ బాబుతో కలిసి పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలోనూ నటించింది. యంగ్ అండ్ స్టార్ హీరోలతో నటించిన ఇలియానా టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు అర్జున్ తో జులాయి, ఎన్టీఆర్ తో రాఖి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఇలియానాకి టాలీవుడ్ లో అందుతున్న నీరాజనాలు చాలక బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. మరి ఏ సౌత్ హీరోయిన్ కైనా ఫైనల్ టార్గెట్ బాలీవుడ్ అన్నది తెలిసిందే కదా. అలా ఇలియానా కూడా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపుదామనుకుంది. కానీ అక్కడ హిట్ సినిమాల్లో అయితే నటించింది కానీ దీపికా, కత్రినా, కరీనా, ప్రియాంక సరసన మాత్రం నిలవలేకపోయింది. ఇక బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూసి చూసి మొహం వాచిపోయిన ఇలియానాకి దర్శకుడు శ్రీను వైట్ల రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని సినిమా అవకాశం ఇచ్చారు.

అమర్ అక్బర్ ఆంటోనిలో అవకాశం...

అసలు ముందుగా అమర్ అక్బర్ ఆంటోనిలో అను ఇమ్మాన్యువల్ నటించాల్సి ఉంది. కానీ ఆమెకున్న పర్సనల్ ప్రోబ్లెంస్ తో అను తప్పుకోవడంతో టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఇలియానాకి ఆ ఛాన్స్ తగిలింది. ఇక అమర్ అక్బర్ ఆంటోనితో ఇలియానా మళ్లీ టాప్ పొజిషన్ కి వెళుతుంది... టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుందనే మొన్నటివరకు అనుకున్నారు. కానీ అమర్ అక్బర్ ఆంటోని ఇలియానా ఫస్ట్ లుక్ చూడగానే ఇల్లి బేబీ మీద ఆశలు అన్ని పోయాయి. కారణం ఆమె లావుగా తయారవడమే. ప్రస్తుతం ఇలియానా నటించిన అమర్ అక్బర్ ఆంటోని థియేటర్స్ లో సందడి చేస్తుంది.

ఇక మరో అవకాశం రాదా..?

మరి సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు. పూర్తి నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకున్న అమర్ అక్బర్ ఆంటోనిలో ఇలియానా పూజ, ఐశ్వర్య పాత్రల్లో మెప్పించలేకపోయింది. ఆమె పాత్రకి గ్లామర్ అద్దినా... నటనకు స్కోప్ లేకపోవడంతో ఇలియానా తేలిపోయింది. ఇలియానా బొద్దుగా మారింది. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తొలి సీన్ల‌లో ఒక‌లా... చివ‌రి సీన్ల‌లో మ‌రోలా ఉంది. మరీ లావైపోయిన ఇల్లీని చూసి అభిమానులు తట్టుకోలేరేమో అన్నట్టుగా ఉంది ఆమె. నటనపరంగా ఇలియానా బాగానే చేసింది. ఇక డాన్ బాస్కో సాంగ్‌లో కాస్త అందంగా కనిపించింది. అయితే కథలో నటించడానికి స్కోప్ లేకపోవడంతో పరిధి మేర నటించాల్సి వచ్చింది. మరి ఈ సినిమా హిట్ ఇలియానాని బిజీ చేస్తుంది అంటే... ఇలియానాకి మరో ఛాన్స్ లేకుండా చేసేలా కనబడుతుంది.

Similar News