ఈ హీరోల పరిస్థితి?

పండగలు వస్తున్నాయ్ వెళుతున్నాయి.. కానీ థియేటర్స్ దగ్గర సందడి కరువైంది. కరోనా వలన మూతబడిన థియేటర్స్ 50 శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోమన్నా డిస్ట్రిబ్యూటర్స్ సాహసం చేయలేకపోతున్నారు. [more]

Update: 2020-11-15 04:36 GMT

పండగలు వస్తున్నాయ్ వెళుతున్నాయి.. కానీ థియేటర్స్ దగ్గర సందడి కరువైంది. కరోనా వలన మూతబడిన థియేటర్స్ 50 శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోమన్నా డిస్ట్రిబ్యూటర్స్ సాహసం చేయలేకపోతున్నారు. దసరా, దీపావళి పండగలకు అన్నా సినిమాలు విడుదలవుతాయి అనుకుంటే.. ఆ రెండు పండగలను కూడా కరోనా దెబ్బేసింది. ఇక థియేటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీ పెరిగాకే రామ్ రెడ్, ఉప్పెన సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకుంటారు ఆయా హీరోలు. కానీ ఇప్పుడిప్పుడే అలా 100 శాతం ఆక్యుపెన్సీ అయ్యేలా కనిపించడం లేదు.
ఎందుకంటే కరోనా ఉదృతి తగ్గింది అంటున్నప్పటికీ.. కొన్ని చోట్ల సెకండ్ వెవ్ అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లో కరోనా సెకండ్ వెవ్ అంటున్న సమయంలో థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు రారు. మరి వచ్చే నెలలోను ఇలానే ఉంటే.. సినిమాల విడుదల కష్టం. ఈ 50 శాతం ఆక్యుపెన్సీ మీద ఏ హీరో సినిమా విడుదల చెయ్యడు. మరి కరోనా సెకండ్ వెవ్ స్టార్ట్ అయ్యింది అంటే సంక్రాంతికి సినిమాల విడుదల కష్టం. అందులోను 50 శాతం ఆక్యుపెన్సీ అంటే.. మరీ కష్టం. మరి చలికాలంలో కరోనా కేసులు ఉధృతమైతే సంక్రాంతికి థియేటర్స్ లో బొమ్మ పడడం జరిగే పని కాదు.
మరి ఈలెక్కన సంక్రాంతికి కచ్చిఫ్ వేసిన సినిమాలన్ని మళ్ళీ కొత్త డేట్ వెతుక్కోవాల్సిందే. ఇప్పటికే క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రంగ్ దే సినిమాలు సంక్రాతి  రిలీజ్ అంటూ గ్రాండ్ గా ప్రకటించాయి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో కదా.

Tags:    

Similar News