టాలీవుడ్ లో ఏంటీ క్లబ్బుల రచ్చ..?

Update: 2018-10-16 10:07 GMT

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఓ కొత్త ట్రేడ్ నడుస్తుంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన వారంలోపే 100 కోట్ల క్లబ్, 200 కోట్ల క్లబ్ అంటూ పోస్టర్ వేయడం ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది. టాలీవుడ్ నిర్మాతలు ఇటువంటి పోస్టర్ రిలీజ్ చేయడంలో ఏమి ఆలోచించట్లేదు. అసలు ఇవన్నీ నమ్మాలా..? ఈ వంద కోట్ల క్లబ్బుల్లో నిజా నిజాలెంత..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తెలుగులో వరసగా మూడు సినిమాలకు వందకోట్ల క్లబ్ పోస్టర్లు వేస్తూ మేకర్స్ హడావుడి చేసేశారు. 100 కోట్లు వరకు సరే అనుకుంటే 200 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటిలో రిలీజ్ అయిన రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే 100 కోట్ల క్లబ్, 200 కోట్ల క్లబ్ అంటూ పోస్టర్లు వేసేయలేదు. కాస్త తాపీగా విజయాన్ని ఖరాకండిగా రూడిగా తెలుసుకున్న తర్వాతే పోస్టర్లు వేశారు. అందుకే దానిపై అంతగా విమర్శలు ఏమి లేవు.

కేవలం ప్రచారాలేనా..?

ఇక తర్వాత వచ్చిన మహేష్ 'భరత్ అనే నేను' సినిమా మాత్రం 100 కోట్ల క్లబ్ పోస్టర్, 200 కోట్ల క్లబ్ పోస్టర్ వేసేసి దానయ్య టీమ్ బోలెడంత హడావుడి చేసేసింది. అందుకే దానిపై బోలెడంత విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ 'అరవింద సమేత' చిత్రం మూడు రోజులకే 100కోట్ల క్లబ్ లో చేరిందంటూ పోస్టర్ వేసేశారు. అసలు ఈ లెక్కలు నిజమేనా..? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కలెక్షన్స్ ఇంత వచ్చాయి.. అంత వచ్చాయి అని పోస్టర్స్ అయితే వేస్తున్నారు కానీ అసలు వాటిలో ప్రొడ్యూసర్స్ కి ఎంత మిగులుతుంది.. డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంత వచ్చింది అనేది మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. ఇలా పోస్టర్స్ వేయడం వెనుక ఇంకో అర్ధం కూడా ఉంది. ఇలా ప్రచారారార్భాటం చేయడం ద్వారా జనాల్ని థియేటర్లకు రప్పించడమే దీనివెనక ఉన్న ఉద్ధేశమని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News