ఈ వారం ట్రేడ్ టాక్..!

Update: 2018-08-06 10:53 GMT

గత శుక్రవారం విడుదలైన సినిమాల్లో గూఢచారి సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా... చి. ల.సౌ సినిమా హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఇక బ్రాండ్ బాబు మాత్రం బ్యాండ్ బజాయించింది. అడివి శేష్ హీరోగా ఆరు కోట్ల రూపాయల లోబడ్జెట్ తో తెరకెక్కిన గూఢచారి సినిమా మంచి వసూళ్లని రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే 90 లక్షల వరల్డ్ వైడ్ షేర్ తో మొదలుపెట్టిన గూఢచారి మూడు రోజులకు గాను సుమారు 3.25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చినట్టు సమాచారం. అందులోనూ ఈ సోమవారం కూడా తెలంగాణలో గూఢచారి వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సోమవారం తెలంగాణ మొత్తానికి బోనాల సెలవు రావడం గూఢచారి కలిసొచ్చే అంశం. ఎలా లేదన్నా గూఢచారి ఈ నాలుగు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తెచ్చేయాలి. లేదంటే శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం 2 మధ్య నలిగిపోవడం ఖాయం.

హిట్ టాక్ వచ్చినా...

సుశాంత్ హీరోగా రాహుల్ దర్శకత్వంలో వచ్చిన చి.ల.సౌ టాక్ బాగుంది. సినిమా హిట్ అంటున్నారు. కానీ వసూళ్లుగా అంతంత మాత్రంగా ఉండడంతో నిర్మాతల్లో కంగారు మొదలైంది. లోబడ్జెట్ లో తెరకెక్కినప్పటికీ... ఈ సినిమా వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి కానీ సూపర్ గా అనిపించడం లేదు. చి.ల.సౌ ఫస్ట్ డే 40 లక్షల షేర్ తో చాలా స్లోగా స్టార్ట్ అయి నిన్న ఆదివారం అనూహ్యంగా పికప్ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ మూడు రోజుల్లో చి.ల.సౌ 1.20 కోట్ల దాకా కొల్లగొట్టిందనే టాక్ వినబడుతుంది. ఇక చి.ల.సౌ కి ఈ రోజు సోమవారం కూడా తెలంగాణలో కలిసొచ్చే అవకాశం ఉంది.

బ్రాండ్ బాబుకు మాత్ర కోలుకోలేని దెబ్బ

ఇక మారుతీ నిర్మాతగా ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రాండ్ బాబు.. సినిమా ఏ విధంగానూ ఆకట్టుకోలేపోతోంది. విడుదలైన మొదటి షోకే నెగెటివ్ టాక్ రావడం.. సినిమా కి కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఎంత తక్కువ బడ్జెట్ తో తీసినా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేలా కనబడడం లేదు. ఈ దెబ్బకి మారుతీ నిర్మాతగా సినిమాలు మానేసిన మానెయ్యొచ్చు అంటున్నారు. దర్శకుడిగా మెల్లిగా ఫామ్ సంపాదించిన మారుతి నిర్మాతగా మాత్రం ఫెయిల్ అయ్యాడంటున్నారు. బ్రాండ్ బాబు మూడు రోజులకు గాను కేవలం 40 లక్షల షేర్ తెచ్చి ఉసూరుమనిపించింది.

Similar News