అన్ని కోట్లు వచ్చాయా....?

Update: 2018-09-26 07:12 GMT

ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల ప్రమోషన్స్ ఎక్కువ అయిపోయాయి. గత వారం రిలీజ్ అయిన 'నన్ను దోచుకుందువటే'కు మంచి టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం డల్ అయ్యాయి. ఏ సెంటర్స్ లో ఓ మోస్తరుగా ఫర్వాలేదు అనిపిస్తున్నా మిగిలిన చోట్ల మాత్రం డీలా పడిపోయింది. దీంతో ట్రేడ్ వారు ఈ సినిమాకి ఫ్లాప్ అనే ముద్రను వేశారు. నిజానికి వెబ్ సైట్స్ లో సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం అసలు కనిపించడం లేదు.

మరో రెండు సినిమాలు వస్తుండటంతో...

ఈ సినిమాకు 7 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి మూడు రోజులు 5 కోట్ల గ్రాస్ వచ్చిందని ఆఫీఫియల్ గా ప్రకటించారు మేకర్స్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వారికే తెలియాలి. ఈ నెగటివ్ టాక్ తో సినిమాకు ప్రాఫిట్స్ రావడం అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ జనం. దీనికితోడు ఈ వారం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాని - నాగార్జునల మల్టీ స్టారర్ దేవదాస్, మణిరత్నం నవాబ్ విడుదల కానున్నాయి.

సినిమాలు బాగున్నా...

ఇక 'కేరాఫ్ కంచరపాలెం' మొదటి షో నుండే అద్భుతం అనే టాక్ తెచ్చుకుంది కానీ కనీసం రెండు వారాలు కూడా ఈ సినిమా థియేటర్స్ లో ఉండకపోవటం హాట్ టాపిక్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మొత్తంగా 3 కోట్లు కూడా దాటలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఆ మధ్య 'మెంటల్ మదిలో, 'నీది నాది ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి మూవీస్ కూడా ఇదే పరిస్థితి. సినిమా బాగుందని టాక్ రావడం.. తీరా కలెక్షన్స్ చూస్తే అసలు లేకపోవడం ఎవరికీ అర్థం కానీ విషయం. సో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టుగా సినిమా సూపర్ ఉంది.. హిట్ అని.. టాక్ బయటికి వస్తున్నప్పటికీ ఆ సినిమాలో అందరికీ నచ్చే యునివర్సల్ అప్పీల్ లేకపోవడంతో ఆ సినిమాల కలెక్షన్స్ తగ్గుతున్నాయి చెబుతున్నారు.

Similar News