ప్రభాస్ ని చూసి జాగ్రత్త పడుతున్న హీరోలు!!

సలహా సినిమా 50 కొట్లది కాస్తా…. యాక్షన్ సీన్స్ అంటూ 300 కోట్లకి చేరింది. హాలీవుడ్ యాక్షన్ చూస్తే ప్రేక్షకులు పడిపోతారనుకుని కథని నిర్లక్ష్యం చేస్తే ఫలితం [more]

Update: 2019-09-09 08:26 GMT

సలహా సినిమా 50 కొట్లది కాస్తా…. యాక్షన్ సీన్స్ అంటూ 300 కోట్లకి చేరింది. హాలీవుడ్ యాక్షన్ చూస్తే ప్రేక్షకులు పడిపోతారనుకుని కథని నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఏమిటనేది సాహో ప్లాప్ నిరూపించింది. అయితే సాహో సినిమా లోని యాక్షన్ మేకింగ్ అండ్ ప్రోమోస్ చూసాక చాలామంది హీరోలు తమ సినిమాల్లోనూ అలాంటి అదిరిపోయే యాక్షన్ ఉంటె బావుంటుంది అనుకున్నారు. అందులో మొదటగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ తో చేసేటిదో? వేణు శ్రీరామ్ తో చేస్తాడో? అనే కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు ఉన్నారు.

సాహో దెబ్బకి….

ముందుగా వేణు శ్రీరామ్ ఐకాన్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని.. అందులోయాక్షన్ పాళ్ళు ఎక్కువ వుండేలా చూడమనడమే కాదు… బడ్జెట్ కూడా పెంచాలని అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కి చెప్పాడని టాక్ నడిచింది. ఇక త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమాని 50 నుంచి 70 కోట్ల బడ్జెట్ తో చేస్తున్న అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ తో 100 కోట్లు పెడతాడేమో అనుకున్నారు. కానీ సాహో దెబ్బకి అల్లు అర్జున్ ఇప్పుడు వేణు శ్రీరామ్ ని పిలిచి కథ ని మార్చి 70 నుండి 80 కోట్ల సినిమాగా చెయ్యమని చెప్పాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో మొదలయ్యింది.

 

 

Tags:    

Similar News