అట్టర్ ఫ్లాప్ ఫిబ్రవరి..!

జనవరిలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు, చిన్న చిత్రాలు అన్నీ ఎఫ్ 2 హావాలో కొట్టుకుపోయాయి. జనవరి నెల మొత్తంలో కేవలం కామెడీ ఎంటరైనర్ ఎఫ్ 2 [more]

Update: 2019-02-27 09:33 GMT

జనవరిలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు, చిన్న చిత్రాలు అన్నీ ఎఫ్ 2 హావాలో కొట్టుకుపోయాయి. జనవరి నెల మొత్తంలో కేవలం కామెడీ ఎంటరైనర్ ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా ఒక్కటే భారీ హిట్ అయ్యింది. మిగతా సినిమాలేవీ యావరేజ్ బోర్డర్ దాటలేకపోయాయి. ఇక ఫిబ్రవరి పరిస్థితి కూడా అంతే. వైఎస్సార్ బయోపిక్ గా ఆయన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే తీసుకుని.. మహి వి రాఘవ్ యాత్ర సినిమాని తెరకెక్కించాడు. ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమాకు హిట్ టాకొచ్చింది. కానీ పొలిటికల్ బయోపిక్ కాబట్టి అన్ని వర్గాల వారిని మెప్పించలేదు. నిర్మాతలకు మాత్రం లాభాలే తెచ్చిపెట్టింది.

ఇలా వచ్చి అలా వెళ్తున్నాయి…

ఇక ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు నాడు.. కాస్త అంచనాలతో విడుదలైన కార్తీ – రకుల్ ప్రీత్ ల దేవ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాగే ప్రియా ప్రకాష్ ఇమేజ్ తో వచ్చిన లవర్స్ డే కూడా బోల్తా పడింది. ఇక ఫిబ్రవరి 22న మంచి అంచనాలతో విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి మహా ఘోరంగా ఉంది. ఆ సినిమాతో పాటుగా విడుదలైన 4 లెటర్స్, మిఠాయి సినిమాలు అట్టర్ ఫ్లాప్ కాగా.. డబ్బింగ్ సినిమాగా వచ్చిన నయనాయతర అంజలి సిబిఐకి హిట్ టాకొచ్చినా ప్రమోషన్స్ లేక థియేటర్స్ వేలవెలబోయాయి.

ఆశలన్నీ ఆ సినిమాపైనే

ఈ ఏడాది మొదలై అప్పుడే రెండు నెలలు గడిచిపోయినా.. ప్రేక్షకులు మెచ్చే సినిమాలేమి థియేటర్స్ లోకి మాత్రం రావడం లేదు. అసలే పిల్లలంతా ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు. దానికి తగ్గట్టే థియేటర్స్ దగ్గర పాప్ కార్న్ అమ్ముకునేవాళ్లు కూడా ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి. మరి జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు సినీ లవర్స్ కి మహా బోర్. ఈ మార్చి అయినా ప్రేక్షకులను మెచ్చే సినిమాలేమన్న అందిస్తుందేమో చూడాలి. ఇక మర్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కళ్యాణ్ రామ్ – నివేత థామస్, షాలిని పాండేల 118 సినిమా మీద ప్రేక్షకుల ఆశలు పెట్టుకుని ఉన్నారు.

Tags:    

Similar News