టాలీవుడ్ కళతప్పింది..!

2018 టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే ఊపుతో 2019 కూడా [more]

Update: 2019-02-21 12:20 GMT

2018 టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే ఊపుతో 2019 కూడా ఉంటుందని అంతా భావించారు. 2019 స్టార్టింగ్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మూడు సినిమాల్లో ఎఫ్ 2 ఒక్కటి తప్ప మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎఫ్ 2 చిత్రం రెండు వారాల కిందివరకు బాగానే ఆడింది. ఇక ఫిబ్రవరి నెల స్టార్టింగ్ లో రెండు సినిమాలు వచ్చాయి. అఖిల్ మిస్టర్ మజ్నుతో పాటు ‘యాత్ర’ కూడా వచ్చింది. రెండు సినిమాల్లో యాత్ర టాక్ పరంగా హిట్ అందుకుంది కానీ వసూళ్లు మాత్రం పెద్దగా దక్కించుకోలేదు. అలానే గత వారంలో వచ్చిన ‘దేవ్’, ‘లవర్స్ డే’ వీకెండ్ ముగిసే లోపే అడ్రస్ లేకుండా పోయాయి. చెప్పుకోవడానికి తెలుగు లో ఏ సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో డల్ గా నడుస్తోందిప్పుడు.

మహానాయకుడుపై అంచనాలు నిల్

మరి ఈ పరిస్థితి మారాలంటే ఏదైనా మంచి సినిమా రావాలి. కానీ సూచనలు ఏమీ కనిపించడం లేదు. రెండు రోజుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. ఈ మూవీపైన ఎటువంటి హోప్స్ లేవు. బుకింగ్స్ చూస్తే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. అలానే ఈ సినిమాతో పాటు ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన డార్క్ కామెడీ ‘మిఠాయి’ ప్రోమోలు బాగానే అనిపించాయి. కానీ ఎటువంటి ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాపై బజ్ లేదు. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడాలంటే ఏ సినిమా తెస్తుందో చూడాలి.

Tags:    

Similar News