ఆకట్టుకుంటున్న ‘తిప్పరా మీసం’

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘తిప్పరా మీసం’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవిష్ణు లుక్ చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పగిలిన అద్దాలు అతని క్యారెక్టరైజేషన్ [more]

Update: 2019-02-06 07:21 GMT

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘తిప్పరా మీసం’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవిష్ణు లుక్ చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పగిలిన అద్దాలు అతని క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నాయి. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో శ్రీవిష్ణుతో ఈయనకు ఇదే తొలి సినిమా. యాక్షన్ డ్రామాగా తిప్పరా మీసం తెరకెక్కుతోంది. నిక్కి తంబోలీ, రోహిణి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘తిప్పరా మీసం’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Tags:    

Similar News