దుర్గారావు ని ఎవరు గట్టిగా వాడతారు!!

టిక్ టాక్ లో దుర్గారావు అనే వ్యక్తి ఆయన భార్య కలిసి హిట్ సాంగ్స్ కి దుర్గరావు నాట్యమండలి అని పేరు పెట్టి వేసిన ఫన్నీ డాన్స్ [more]

Update: 2020-09-06 05:51 GMT

టిక్ టాక్ లో దుర్గారావు అనే వ్యక్తి ఆయన భార్య కలిసి హిట్ సాంగ్స్ కి దుర్గరావు నాట్యమండలి అని పేరు పెట్టి వేసిన ఫన్నీ డాన్స్ లు సోషల్ మీడియాలో టిక్ టాక్ లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. దుర్గారావు దంపతులు తమ రోజువారీ పనులతో పాటుగా ఇలా ఫన్నీ గా డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. వీళ్ళకి టిక్ టాక్ లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. అయితే టిక్ టాక్ యాప్ కేంద్రం ఆపేసినా.. దుర్గారావు దంపతులు యూట్యూబ్ లోను తమ హావ కొనసాగిస్తున్నారు. అయితే జబర్దస్ ఆది అటు యాంకర్స్ ని కానీ, ఇటు పాపులర్ ఫిగర్స్ ని కానీ తన జబర్దస్త్ స్కిట్స్ లో హైలెట్ చేసి మార్కులు కొట్టేస్తుంటారు. అయితే ఈమధ్యనే ఆది స్కిట్ లో దుర్గారావు దంపతుల ఎంట్రీ ఇచ్చారు. 

అంతేకాదు జబర్దస్త్ మీద పోటీగా మొదలైన అదిరింది ప్రొగ్రాంలోను దుర్గారావు దంపతులు మొదటిగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. అయితే జబర్దస్త్ లో ఆది స్కిట్ లో ఓ అర నిమిషమే కనబడిన దుర్గారావు.. అదిరింది షోలో మాత్రం  బాగా హైలెట్ అయ్యాడు. అయితే సుధీర్ బ్యాచ్ దుర్గారావు ఆయన భార్య ని జబర్దస్త్ లోకి ఆహ్వానించడానికి వాళ్ళ ఊరు వెళ్లారని.. అంటున్నారు. ఇక దుర్గారావు జబర్దస్త్ కన్నా ఎక్కువగా అదిరిందిలోనే పాపులర్ ఫిగర్ లా కనబడుతునాన్డు. జబర్దస్త్ దుర్గారావు ని అంతగా వాడలేదు కానీ అదిరింది సద్దాం స్కిట్ లో దుర్గారావు ని బాగా వాడేశారు.

Tags:    

Similar News