టికెట్ టు ఫినాలే కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ సీజన్ లాస్ట్ వీక్స్ లో షో ని రసవత్తరంగా అమరుస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ లో హారిక, అభిజిత్, అఖిల్, అవినాష్, [more]

Update: 2020-12-02 05:35 GMT

బిగ్ బాస్ సీజన్ లాస్ట్ వీక్స్ లో షో ని రసవత్తరంగా అమరుస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ లో హారిక, అభిజిత్, అఖిల్, అవినాష్, మోనాల్ ఉండగా.. అరియనా, సోహైల్ సేఫ్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ సీజన్ టికెట్ టు ఫినాలే టాస్క్ కోసం కంటెస్టెంట్స్ కొట్లాట ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ టాస్క్ లో ఆవుపాలు నింపి.. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అలాగే అందరికన్నా ఎక్కువగా పాలు నింపిన వాళ్ళు డైరెక్ట్ టాప్ ఫైవ్ కి వెళ్ళిపోతారు. ఆ టాస్క్ లో హౌసెమెట్స్ అందరూ ఎగబడి పాలు పిండడానికి వెళ్లి, అక్కడ పాలు నింపే క్రమంలో కొట్లాడుకుంటున్నారు.

హౌస్ మేట్స్ అందరూ ఎవరి పాల టిన్ తో వాళ్ళు పాలు పట్టి టికెట్ టు ఫినాలే కొట్టాలని డిసైడ్ అయ్యి.. కొట్టుకున్నారు. బజర్ మోగగానే అందరూ పరిగెత్తి ఆవు దగ్గర పాలు నింపే ప్రాసెస్ లో అవినాష్ – సోహైల్ లు గొడవ పెట్టుకున్నారు. అవినాష్ డబ్బా పగలడంతో సోహైల్ – అవినాష్ గొడవ స్టార్ట్ అయ్యింది. కావాలనే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తనని ఇంటి నుండి బయటికి పంపే ప్లాన్ చేస్తున్నారని… నేను ఈ టాస్క్ చేయను అంటూ ఫైర్ అయ్యాడు అవినాష్. అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారనగానే నిన్నెవరు టార్గెట్ చేయలేదంటూ అఖిల్ స్టార్ట్ చేసాడు. మరి ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ మధ్యన వచ్చిన గొడవ హైలెట్ అనేలా ఉంది.

Tags:    

Similar News