పూర్ రివ్యూస్... కలెక్షన్స్ అదుర్స్..!

Update: 2018-11-09 08:49 GMT

అమీర్ ఖాన్, అమితాబచ్చన్ హీరోలుగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన థగ్స్ అఫ్ హిందుస్థాన్ నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. భారీ అంచనాల నడుమ బాహుబలిని తలేదాన్నే అంచనాల మధ్య విడుదలైన థగ్స్ అఫ్ హిందుస్థాన్ ని క్రిటిక్స్ చీల్చి చెండాడారు. సినిమాలో ఎలాంటి విషయం లేదని... బాలీవుడ్ డిజాస్టర్స్ కే తలదన్నే డిజాస్టర్ థగ్స్ అఫ్ హిందుస్థాన్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వచ్చాయి. ఇక రివ్యూ రైటర్స్ అయితే థగ్స్ అఫ్ హిందుస్థాన్ ని ఆడుకున్నారు. ఈ సినిమాకి చెత్త రేటింగ్స్ ఇచ్చారు.

మొదటిరోజు రికార్డు కలెక్షన్స్

థగ్స్ అఫ్ హిందుస్థాన్ ఏవిధంగానూ చూసేందుకు పనికిరాని మూవీగా విమర్శకులు సైతం తేల్చేశారు. మరి భారీ అంచనాల నడుమ పూర్తి నెగెటివ్ టాక్ తో ఉన్న థగ్స్ అఫ్ హిందుస్థాన్ భారీ ఓపెనింగ్స్ అయితే కొల్లగొట్టింది. బాలీవుడ్ లో ఈ మొదటి రోజు 50కోట్ల వసూళ్లను రాబట్టి కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు బాలీవుడ్ లో విడుదలైన హిందీ సినిమాల్లో ఈ థగ్స్ అఫ్ హిందుస్థాన్ కి బెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషంగా చెబుతున్నారు. మరి బాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించిన థగ్స్ అఫ్ హిందుస్థాన్ మిగతా భాషల్లో మాత్రం ఉసూరుమంది.

వారి వల్లే కలెక్షన్లు...

తెలుగు, తమిళం వంటి భాషల్లో ఈ థగ్స్ అఫ్ హిందుస్థాన్ కి కనీసం ఓపెనింగ్స్ కూడా లేవు. అయితే బాలీవుడ్ లో థగ్స్ అఫ్ హిందుస్థాన్ కి మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం అమీర్ ఖాన్ స్టామినా, అమీరా ఖాన్ - అమితాబ్ బచ్చన్ కాంబో... ఇంకా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన కత్రినా కైఫ్ అంటున్నారు. వారి మీద భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు ఇలా సినిమాకి మంచి కలెక్షన్స్ ఇచ్చారంటున్నారు. మరో టాలీవుడ్ బాహుబలిని తలదన్నేద్దామనుకునన్న మేకర్స్ కి థగ్స్ అఫ్ హిందుస్థాన్ ఇపుడు దానికొచ్చిన రివ్యూస్ చూసి ఉస్సురుమానాల్సి వచ్చింది.

Similar News