ఫ్లాప్ అయినా... దిమ్మతిరిగే కలెక్షన్స్..!

Update: 2018-11-12 08:10 GMT

బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ సినిమాలంటే కచ్చితంగా బాగుంటాయి అని ఓ నమ్మకం ఉంటుంది ప్రేక్షకుల్లో. ఎందుకంటే ఆమీర్ ఖాన్ సెలెక్ట్ చేసిన సినిమాలు అలా ఉంటాయి. అతని సినిమాల్లో కథతో పాటు అన్ని ఎమోషన్స్ కూడా ఉండటంతో.. అతని సినిమా వస్తుందంటే వెయిట్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అలానే ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్" కోసం కూడా చాలా మంది వెయిట్ చేశారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది ఈ సినిమా.

సినిమాపై నెటిజన్ల ట్రోల్స్...

రిలీజ్ రోజు ఉదయం ఆట నుండే ఈ సినిమాకు నెగటివ్ రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా తీవ్రమైన విమర్శలు ఎదురుకుంటోంది. అసలు ఇది ఆమీర్ ఖాన్ సినిమానేనా? అని నెటిజన్లు వాపోయారు. సినిమా ఫ్లాప్ కావడంలో ఇందులో పెద్దగా కథ ఏమీ లేకపోవడం.. దీంతో పాటు ఆమీర్ ఖాన్.. అమితాబ్ లాంటి సూపర్ స్టార్స్ ఉండటంతో భారీ అంచనాలు.. డైరెక్షన్ వీక్ గా ఉండటం ఈ సినిమాను డిజాస్టర్ గా నిలిచింది. గతంలో వచ్చిన 'ట్యూబ్ లైట్', 'రేస్ త్రీ' సినిమాలు కూడా ఈ స్థాయి ట్రోల్ ను ఎదుర్కున్నాయి. ఇప్పుడు అంతే స్థాయిలో ఈ సినిమా ఎదురుకుంటుంది.

నిండా మునిగారు...

నెగటివ్ టాక్ వచ్చినప్పటికి ఈ సినిమా వసూళ్లకు అయితే లోటు లేదని అంటున్నారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ ను దాటిందని ట్రేడ్ చెబుతుంది. అక్కడితో ఆ సినిమా వసూళ్ల వేట ఆగిపోయిందని చెబుతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు వందకోట్లు ఒక మూలకి కూడా రావు. దీంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, అమ్మిన ప్రొడ్యూసర్స్ కి భారం తప్పదు.

Similar News