అది నిజం కాదంటున్న ఆచార్య దర్శకుడు!!

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ ముందు కొంతమేర పూర్తి చేసుకుంది.లాక్ డౌన్ ముగిసి కరోనా ఉధృతి తగ్గగానే [more]

Update: 2020-06-17 08:01 GMT

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ ముందు కొంతమేర పూర్తి చేసుకుంది.లాక్ డౌన్ ముగిసి కరోనా ఉధృతి తగ్గగానే మల్లి ఆచార్య సినిమా సెట్స్ మీదకెళ్తారు కొరటాల అండ్ చిరు బ్యాచ్. అయితే కరోనా లాక్ డౌన్ టైం లో ఆచార్య సినిమా విషయాలను దఫా దఫాలుగా మీడియాతో పంచుకున్నాడు కొరటాల. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర సినిమాకే కీలకం అన్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ చిరుగా రామ్ చరణ్ కనిపిస్తాడని మొదట ప్రచారం జరిగినా.. ఆతర్వాత కాదు రామ్ చరణ్ పాత్ర కథను మలుపు తిప్పే పాత్ర అంటూ ప్రచారం జరిగింది.

తర్వాత రామ్ చరణ్ కి చిరు  కి ఆస్తి తగాదాలు ఆచార్య సినిమాలో ఉంటాయని.. ఓ స్థలం వివాదంలో రామ్ చరణ్ కి చిరు కి మధ్యన ఫైటింగ్ అవుతుంది అని.. తర్వాత అన్ని తెలుసుకుని ఇద్దరూ ఒక్కటవుతారని అబ్బో చాలానే ప్రచారం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆస్తి వివాదం నేపధ్యలోనే కొరటాల చిరు – రామ్ చరణ్ కాంబో సీన్స్ ని హైలెట్ చేస్తున్నాడని అన్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై కొరటాల శివ స్పందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చిరుకి హెల్ప్ చేసే పాత్రలో కనిపించబోతున్నాడని.. అసలు చరణ్ కి సంబందించిన సీన్స్ ఇంతవరకు డిజైన్ చెయ్యలేదని.. చరణ్ అసలు తన సీన్స్ కి సంబందించిన కథ వినలేదని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆచార్య పై వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని కొరటాల కొట్టిపారేస్తున్నారు. 

Tags:    

Similar News