ఈ వారం ఎలిమినేట్ అయ్యేది?

నాగార్జున హోస్టింగ్ లో సక్సెస్ ఫుల్ గా ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 లో మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అనుకుంటున్నారు అందరూ. అవినాష్ [more]

Update: 2020-12-01 10:44 GMT

నాగార్జున హోస్టింగ్ లో సక్సెస్ ఫుల్ గా ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 లో మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అనుకుంటున్నారు అందరూ. అవినాష్ అయితే జస్ట్ ఎలిమినేట్ అవ్వబోయి.. తప్పించుకున్నాడు. లేదంటే అవినాష్ బయట ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇచ్చుకునేవాడు. ఇక మోనాల్ గత రెండు వారాల క్రితం వరకు సరిగా ఆడకుండా గ్లామర్ తోనూ, అఖిల్ ట్రాక్ తో నెట్టేసింది. కానీ ఇప్పుడు బాగా ఆడేస్తుందన్న కారణంతో హౌస్ లో కొనసాగుతుంది. ఇక అభిజిత్ కి టాస్క్ పెరఫార్మెన్స్ తక్కువ బిల్డప్ ఎక్కువ. హారిక గట్టిగా పోరాడుతుంది కానీ.. అభిజిత్ విషయంలో వీకైపోతుంది. ఇక అరియనా అరుపులు.. కానీ ఫెయిర్ గేమ్. సోహైల్ అయితే అందరిని మడతెట్టేస్తాడు.

అయితే ఈ సోమవారం  నామినేషన్స్ ప్రక్రియలో హౌస్ మేట్స్ అసలు రంగులు బయటికొచ్చాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో రంగు నింపి కారణం చెప్పి ఇంటి సబ్యులని నామినేట్ చెయ్యాలి. అందులో హారిక అభిజిత్ ని నామినేట్ చేసి షాకిచ్చింది. నాగార్జున క్లాస్ కి హారిక అభిజిత్ కి బొమ్మ చూపించింది. అంతేనా మోనాల్ అఖిల్ ని నామినేట్ చేసి షాకివ్వగా.. అఖిల్ నన్ను బ్యాడ్ చేస్తున్నావ్ అంటూ మోనాల్ తో గొడవ సార్ట్ చేసాడు. అరియనా – మోనాల్ గొడవకి అవినాష్ ఆజ్యం పోసాడు. అలాగే అవినాష్ నేను స్ట్రాంగ్ అంటున్న అఖిల్ కి కౌంటర్ వేసాడు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను.. నాకన్నా వీక్ ఉన్న వాళ్ళు హౌస్ లో ఎలా ఉంటారంటూ అవినాష్ రాష్ అయ్యాడు. 

ఇక ఈ వారం నామినేషన్స్ లో అభిజిత్, అవినాష్, మోనాల్, హారిక, అఖిల్ ఉండగా సోహైల్, అరియనాలు సేఫ్ జోన్ లో ఉన్నారు. మరి నామినేట్ అయినా ఐదుగురిలో అందరిలో వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ అవినాష్, మోనాల్ కనిపిస్తున్నారు. వారిద్దరూ డబల్ గా వెళతారా? లేదంటే అవినాష్ ఆర్ మోనాల్ లో ఒక్కరు ఎలిమినేట్ అవుతారా? అనేది శనివారం క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News