ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఏంటో చూద్దాం..!

Update: 2018-08-13 10:45 GMT

తెలుగులో పోయిన వారం రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులని నిరాశపరచడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఫెయిల్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం'.. కమల్ నటించిన 'విశ్వరూపం 2 ' ఈ రెండు సినిమాలు వసూళ్ల విషయంలో ఫెయిల్ అయ్యాయి. వాస్తవానికి పోయిన వారం రిలీజ్ అయ్యిన సినిమాలపై ట్రేడ్ చాలానే హోప్స్ పెట్టుకుంది. కానీ రెండు సినిమాల ఫెయిల్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల నాలుగు రోజుల కలెక్షన్స్ ఒకసారి చూద్దాం.

అనుకున్న దాంట్లో సగమే...

ముందుగా దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' చూస్కుంటే.. మొదటి నుండి దిల్ రాజు పదే పదే గొప్ప సినిమా తీసాం అని చెప్పుకున్నా సినిమా రెజుల్ట్ వేరేలా రావడంతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ డల్ అయ్యాయి. మొదటి రోజు మాత్రం అంచనాలు తగ్గట్టుగానే 2 కోట్ల 95 లక్షల దాకా షేర్ తెచ్చుకుంది. నిన్న మొన్న సెలవులు కాబ్బటి కొంచం పుంజుకున్నప్పటికీ నాలుగు రోజులకు గాను మొత్తం 8 కోట్ల 75 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ట్రేడ్ మాత్రం 15 కోట్ల దాకా ఆశించింది. అయితే అది జరగలేదు.

దారుణంగా విశ్వరూపం కలెక్షన్లు

ఇక కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో నటించిన 'విశ్వరూపం 2 ' మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడంతో మొదటి రోజు కేవలం 77 లక్షలు తెచ్చి నిరాశపరిచింది. నాలుగు రోజులకు గాను ఈ సినిమా కేవలం 1 కోటి 50 లక్షలు మాత్రం కలెక్ట్ చేసిందని టాక్. ఇలా అయితే ఈ సినిమాను కొన్న బయర్స్ కు నష్టాలు తప్పవని అంటున్నారు ట్రేడ్ వారు. ఇక అడివి శేష్ 'గూఢచారి' చిత్రం మాత్రం అందరినీ సేఫ్ జోన్ లోకి తీసుకుని వెళ్లిపోయింది. చాలా ఏరియాస్ లో రెండో వారంలోకి అడుగు పెట్టక కూడా స్ట్రాంగ్ గా దూసుకుపోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు ఫెయిల్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

Similar News