వీళ్ళిద్దరూ కలిస్తే..!!

కొరటాల శివ కి స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తే మెగా హీరోతో సినిమా బోణి అవుతుంది అనుకుని రామ్ చరణ్ తో సినిమాకి లైన్ [more]

Update: 2020-06-12 12:01 GMT

కొరటాల శివ కి స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తే మెగా హీరోతో సినిమా బోణి అవుతుంది అనుకుని రామ్ చరణ్ తో సినిమాకి లైన్ క్లియర్ చేసుకుని ముహూర్తం కూడా పెట్టాడు. కానీ ఏమైందో రామ్ చరణ్ కొరటాల శివ సినిమా నుండి తప్పుకుని.. కొరటాల ని తండ్రి చిరు ఆచార్యకి తగిలించాడు. రామ్ చరణ్ కాకపోయినా చిరు తగలడంతో కొరటాల హాప్పీనే. కాకపోతే యంగ్ హీరో స్టార్ హీరో రామ్ చరణ్ అయితే ఇంకా సూపర్.  అయితే కొరటాల కి ఇప్పుడు మరో స్టార్ మెగా హీరో దొరకబోతున్నాడట. ప్రస్తుతం అలా వైకుంఠపురములో హిట్ తో పాన్ ఇండియా లెవల్లో పుష్ప ని సుకుమర్ తో కలిసి చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేసినా.. చెయ్యకపోయినా.. కొరటాలతో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

కొరటాల శివ తో బన్నీ కొత్త కలయిక అయినప్పటికీ.. మెగా కంపౌండ్ లోనే ఏడాది కాలంగా ఉంటున్న కొరటాల శివ బన్నీ కి అదిరిపోయే  ఓ లైన్ చెప్పాడట. దానితో బన్నీ చేద్దాం సర్ అంటూ కొరటాలకి మాటిచ్చినట్లుగా అది కూడా పాన్ ఇండియా లెవల్ స్క్రిప్ట్ తోనే సినిమాకి దిగుదామని అల్లు అర్జున్ కొరటాలతో గట్టిగ చెప్పినట్టుగా న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. కొరటాల శివ పంధాలోనే బలమైన సామజిక సందేశమున్న కథాంశంతోనే ఈ సినిమా ఉండబోతుంది అని.. దానికి బన్నీ అల్లరిని, కామెడీని జోడించి పాన్ ఇండియా మెచ్చే స్క్రిప్ట్ తోనే కొరటాల – అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది ఆనే టాక్ నడుస్తుంది.  

Tags:    

Similar News