డేట్ ఇవ్వకుండా.. వణికిస్తున్నారు

వెంకటేష్ – నాగ చైతన్య కలయికలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకిమామ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. రియల్ మామ అల్లుళ్ళు రీల్ మామ అల్లుళ్లుగా [more]

Update: 2019-10-16 07:24 GMT

వెంకటేష్ – నాగ చైతన్య కలయికలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకిమామ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. రియల్ మామ అల్లుళ్ళు రీల్ మామ అల్లుళ్లుగా కనిపిస్తారు గనక ప్రేక్షకుల్లో ఈ సినిమా పై పిచ్చ ఆసక్తి ఉంది. అయితే వెంకిమామ ఈ దసరాకే విడుదలవుతుందని అనుకున్నారు అంతా. కానీ వెంకిమామ కొన్ని ప్రోబ్లంస్ వలన అనుకున్న టైం కి రాకుండా ఇంకా రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. దీంతో సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల దర్శకనిర్మాతలను డైలమాలో పెట్టింది.

ఎదురుచూపులు….

వెంకిమామ ఎప్పుడు విడుదలవుతుందా అని ఇతర సినిమాల హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ క్రిష్ట్మస్ కి వెంకిమామ డేట్ ఇస్తారేమో అని అప్పుడు విడుదల కాబోతున్న డిస్కో రాజా, భీష్మ, ప్రతిరోజూ పండగే హీరోలు కంగారు పడుతున్నారు. తూచ్ వెంకిమామ సంక్రాంతికే రిలీజ్ అంటూ.. అప్పుడు విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా సినిమా హీరోలు కంగారు పడేలా ప్రచారం జరుగుతుంది. అయినా వెంకిమామ మీద ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాకి సోలో డేట్ దొరికితే సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయంటున్నారు. కానీ వెంకిమామ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి… ప్రమోషన్స్ చేసుకుని బరిలో నిలుస్తుందో అని అక్కినేని, దగ్గుబాటి అభిమానులే కాదు… ఇతర సినిమా దర్శకనిర్మాత హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు.

 

 

Tags:    

Similar News