విజిల్‌ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజ‌య్‌` పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న [more]

Update: 2019-10-18 13:28 GMT

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం 'విజ‌య్‌' పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా 'బిగిల్‌'. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని 'విజిల్‌'గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్బంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం అక్టోబ‌ర్ 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

25న విడుదల….

సినిమా లేడీస్ ఫుట్‌బాల్ క్రీడ‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించ‌గా రాజ‌ప్ప అనే మాస్ క్యారెక్ట‌ర్‌తో పాటు యంగ్ లుక్‌లోని మైకేల్ అనే ఫుట్‌బాల్ కోచ్ పాత్ర‌లో విజ‌య్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. న‌య‌న‌తార గ్లామ‌ర్ సినిమాకు ఓ ప్ల‌స్ కానుంది. లేడీస్ ఫుట్‌బాల్ టీమ్‌ను మైకేల్ ఎలా ట్రయిన్ చేశాడు. అనే కాన్సెప్ట్‌తో క‌ట్ చేసిన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

 

 

Tags:    

Similar News