అందుకే వెళ్ళొచ్చాను!!

రెండు వారాల క్రితం అంటే కరోనా లాక్ డౌన్ మొదలైన కొత్తల్లో మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఉన్నట్టుండి ఇన్స్టా ఖాతా నుండి బయటికి వచ్చేసింది. [more]

Update: 2020-06-04 09:57 GMT

రెండు వారాల క్రితం అంటే కరోనా లాక్ డౌన్ మొదలైన కొత్తల్లో మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఉన్నట్టుండి ఇన్స్టా ఖాతా నుండి బయటికి వచ్చేసింది. ఎప్పటికప్పుడు అభిమానులకి అందుబాటులో ఉండే ప్రియా ప్రకాష్ ఉననట్టుంది ఇన్స్టా నుండి బయటికి రావడంతో అభిమనులు షాకయ్యారు. కన్ను గీటు సుందరి ఓవర్ నైట్ లో సోషల్ మీడియా క్వీన్ గా అవతరించింది. ఆ తర్వాత టిక్ టాక్, పేస్ బుక్ వీడియోస్ తోనూ పాపుల్లర్ అయ్యింది అలాంటి ప్రియా ప్రకాష్ వారియర్ ఉన్నట్టుండి ఇన్స్టా నుండి బయటికి రావడం జీర్ణించుకోలేకపోయారు. ఆయితే తాజాగా మల్లి ఇన్స్టా లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్. అయితే అసలెందుకు ఇన్స్టా నుండి బయటికెళ్లానో అని చాలామంది అడుగుతున్నారని.. అయితే కేవలం మానసిక ప్రశాంతత కోసమే నేను ఇన్స్టా నుండి తప్పుకున్నా కానీ ఇంకేం కారణం లేదని చెప్పింది.

మల్లి ఇన్స్టా కి రాగానే హాయ్ ఆల్.. నేను ఇన్స్టా నుండి ఎందుకు బయటికెళ్లానో అని అందరూ తెగ అలోచించి ఉంటారు. పెద్దగా కారణం ఏం లేదు ..బ్రేక్ తీస్కోవాలనుకున్నాను తీసుకున్నాను. రెండు వారాల పటు మానసికంగానూ, ప్రశాంతంగాను, ఆహ్లాదంగాను గడిపేశాను.  అయితే నేను ఇన్స్టా నుండి దూరమైనప్పుడు నాపై చాలా దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. చాలా కామెంట్స్ కేసుల వచ్చాయి. అయితే అన్ని ట్రోల్స్ లోను నన్ను బాధపెట్టిన ట్రోల్ ఒక్కటే. అది నేను ఇన్స్టా నుండి వైదొలిగినప్పుడు పబ్లిసిటీ కోసమే ప్రియా ప్రకాష్ ఇన్స్టా నుండి బయటికి వెళ్ళింది అన్నారు. ఆ ట్రోల్ నను చాలా బాధించింది అని చెబుతుంది.

Tags:    

Similar News