అందుకే కాజల్ అంతగా బిజీ అవుతుంది?

కాజల్ పని అయిపోయింది అనుకున్న టైం లో మళ్ళి ఉవ్వెత్తున కెరటంలా లేస్తుంది. కెరీర్ సుదీర్ఘంగా సాగిస్తున్న కాజాల అగర్వాల్ కి ఒక టైం లో అవకాశాలు [more]

Update: 2020-05-28 06:47 GMT

కాజల్ పని అయిపోయింది అనుకున్న టైం లో మళ్ళి ఉవ్వెత్తున కెరటంలా లేస్తుంది. కెరీర్ సుదీర్ఘంగా సాగిస్తున్న కాజాల అగర్వాల్ కి ఒక టైం లో అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ… మల్లి కాజల్ అవకాశాలతో ఉన్నట్టుండి పుంజుకుంటుంది. ఏ సీనియర్ హీరోయిన్స్ కి లేని అవకాశాలు కాజల్ చేతిలో ఉంటున్నాయి. తాజాగా చిరు సరసన ఆచార్య లో నటిస్తున్న కాజల్ తమిళనాట కమల్ హాసన్ భారతీయుడు 2 లో నటిస్తుంది. అయితే కాజల్ తాజాగా అంతగా బిజీ అవడానికి ఓ స్పెషల్ కారణముంది అంటున్నారు.

అదేమిటంటే ప్రస్తుతం ఏ హీరోయిన్ ని టచ్ చేసినా భారీ పారితోషికాలు అడగడం.. కరోనా లాక్ డౌన్ కారణంగా బడ్జెట్ కంట్రోల్ చెయ్యడంతో నిర్మాతలకు కూడా తక్కువ పారితోషకం తీసుకునే హీరోయిన్స్ పై కన్ను పడిందట. ఎలాగూ అందం, గ్లామర్, అన్ని ఉన్న కాజల్ అయితే అనుకున్న బడ్జెట్ లోనే వస్తుంది గనక ఇప్పుడు తాజాగా నిర్మాతలు చాలామంది కాజల్ నే సంప్రదించేందుకు మొగ్గు చూపుతున్నారట. తమన్నా ఇప్పటికి పారితోషకం విషయంలో ఓ మెట్టు దిగడం లేదు. త్రిష కూడా అనుకోకుండా సినిమా సెట్స్ వదిలిపెట్టేస్తుంది. కాజల్ అయితే అందుబాటులో అనుకున్న పారితోషికాన్ని రెడీగా ఉంటుంది కాబట్టే కాజల్ కి ఆఫర్స్ అంతలా తగులుతున్నాయట.

Tags:    

Similar News