తరుణ్‌ భాస్కర్‌ కొత్త అవతారం..!

Update: 2018-10-08 06:42 GMT

'పెళ్లి చూపులు' సినిమాతో తనలోని టాలెంట్ ను ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలకి చూపించాడు డైరెక్టర్ తరుణ్‌భాస్కర్‌. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ దర్శకుడు తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే డిఫరెంట్ సినిమా తీసాడు. కానీ అది డిజాస్టర్ గా నిలించింది. విజయ్ దేవేరుకోండకు లైఫ్ ఇచ్చిన ఈ దర్శకుడు ప్రస్తుతం మూడో సినిమా ఏం చేస్తున్నాడో అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో.. కొన్నాళ్ల పాటు తను దర్శకత్వానికి చిన్న విరామం ఇవ్వనున్నాడని తెలిసింది. కానీ సినిమాలకి దూరం మాత్రం కావట్లేదు. దర్శకుడిగా పేరున్న తరుణ్ త్వరలోనే నటుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

పాతబస్తీ యువకుడిగా...

తాజా సమాచారం ప్రకారం.. తీవ్రవాద నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట! ఇందులో తరుణ్‌ భాస్కర్‌ హైదరాబాద్‌ పాతబస్తీ యువకుడిగా కనిస్తారని టాక్‌. తమిళ యంగ్ డైరెక్టర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. సినీ ఇండస్ట్రీకి తరుణ్‌భాస్కర్‌ దర్శకుడిగా పరిచయమైనా… నటుడిగా ఈ చిత్రంతో అతడి ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. దర్శకుడిగా అయితే మంచి మార్కులు తెచ్చుకున్నాడు మరి నటుడిగా ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.

Similar News