గూఢచారిపై ఫైర్ అవుతున్న దర్శకనిర్మాత

Update: 2018-08-12 16:27 GMT

ఆగష్టు 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అడివి శేష్ గూఢచారి సినిమా మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. అడివి శేష్ కథతో శశి కిరణ్ టిక్కా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. అభిషేక్ పిక్చర్స్ వారు 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా అందరిని మెప్పించింది. క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సినిమా కి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో అడివి శేష్ నటనకు, జగపతి బాబు విలనిజానికి ప్రేక్షకులు పడిపోతున్నారు. ఈ సినిమాలో త్రినేత్ర అనే ఒక రా ఏజెంట్ కంపెనీ, ఇండియాని బోర్డర్ లో ఉండి కాపాడడం కాదు.. ఇండియా మధ్యలో ఉండి కాపాడాలంటూ.. కొంతమంది కి ట్రైనింగ్ ఇప్పించి వారితో ఇండియా ని కాపాడే ఒక రా కంపెనీ.

అందులో భాగంగా అడివి శేష్ మధు షాలిని ఇంకా నలుగురికి ఈ త్రినేత్రలో ట్రైనింగ్ తీసుకుని ఇండియాని కాపాడ్డానికి బయలుదేరే క్రమంలో శత్రువులు అడివి శేష్ (అర్జున్ ఉరఫ్ గోపి) ఐడెంటిటీ ని వాడుకుని త్రినేత్ర వ్యవస్థాపకుడు ఆచారితో సహా త్రినేత్రలోని అతి ముఖ్యమైన వ్యక్తులను మట్టుపెడడంతో.. ఈ నేరం అర్జున్ మీద పడుతుంది. అలాంటి టైం లో త్రినేత్ర స్క్రీన్ మీద టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రా అధికారిగా.. వెంటనే అర్జున్ ని ట్రేస్ చెయ్యండి.. ఆరు నెలలుగా మనమే అతనికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వదిలాము.. మన టెక్నీక్ తోనే మనల్ని మట్టు బెడుతున్నాడంటూ.. త్రినేత్ర అధికారులను అలెర్ట్ చేస్తాడు. అయితే తమ్మారెడ్డి భరద్వాజని ఈ రోల్ చెయ్యమని ఈ సినిమ హీరో అడివి శేష్ అడిగాడట. అంకుల్.. ఓ మంచి రోల్ వుంది వేస్తారా అని అడివి శేష్ బ్రతిమాలితే.. తమ్మారెడ్డి ఒప్పుకుని గూఢచారిలో ఆ రోల్ ప్లే చేసాడట.

అయితే సినిమా విడుదలై హిట్ అయ్యింది కానీ.. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదంటూ తమ్మారెడ్డి అడివి శేష్ ని తిట్టిపోస్తున్నాడు. తన వయసుకి కూడా గౌరవం ఇవ్వలేదని.. ఇక గూఢచారి షూటింగ్ ముగిసిన తర్వాత నన్ను కలిసి.. ఫస్ట్ కాపీ చూపిస్తానని మాటిచ్చాడు.. కానీ సినిమా విడుదలయ్యే దాకా నన్ను కనీసం ఒక ఆర్టిస్టుగా కూడా లెక్కలోకి తీసుకోలేదు. అలాగే గూఢచారి షో వేసినప్పుడు ఒక్కసారి కూడా నన్ను పిలవలేదు అంటూ ఆయన అడివి శేష్ మీద నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఇండస్ట్రీ నుండి మాత్రం అంత పెద్దాయన్ని అలా అవమానించడం అడివి శేష్ కి తగదని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

మరి గూఢచారి సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి నెగెటివ్ టాక్ మంచిది కాదు. కానీ తమ్మారెడ్డి కూడా అంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది. కాస్త ఆగాల్సింది అని అంటున్నారు. ఏది ఏమైనా గూఢచారిని అందరూ అంతలా మెచ్చుకుంటూ ఎత్తేస్తున్న సమయంలో ఇప్పుడు తమ్మారెడ్డి మేటర్ మాత్రం కాస్త సెన్సేషన్ అయ్యేలాగే కనబడుతుంది. మరి అడివి శేష్ గూఢచారి హిట్ నుండి ఇంకా బయటికి రాలేదేమో.. అందుకే తమ్మారెడ్డి మాటలను వినబడడంలేదు.. అని కాదు కాదు విన్నా విన్నట్టుగా ఉన్నాడంటున్నారు కొందరు.. చూద్దాం ఈ మేటర్ పై అడివి శేష్ స్పందన.

Similar News