తమన్‌ మళ్లీ అదరగొట్టాడు..!

ఈ సంక్రాంతికి భారీగా వచ్చిన ‘కథానాయకుడు’ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. కానీ ఆయనలో ఈ మధ్య కాస్త పస తగ్గిందని, కేవలం రాజమౌళి మాత్రమే ఆయన [more]

Update: 2019-01-16 11:57 GMT

ఈ సంక్రాంతికి భారీగా వచ్చిన ‘కథానాయకుడు’ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. కానీ ఆయనలో ఈ మధ్య కాస్త పస తగ్గిందని, కేవలం రాజమౌళి మాత్రమే ఆయన నుంచి బెస్ట్‌ అవుట్‌పుట్‌ రాబట్టుకుంటున్నాడనే ఫీలింగ్‌ని ‘కథానాయకుడు’ ఆల్బమ్‌ నిరూపించింది. ఈ మూవీలోని ఒకటి రెండు పాటలు మినహా పెద్దగా హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సాంగ్స్‌ లేవు. కీరవాణి ‘బాహుబలి’ తర్వాత చేసిన ‘సవ్యసాచి’, ఇప్పుడు ‘కథానాయకుడు’ పాటలను చూస్తే కీరవాణి రిటైర్‌మెంట్‌ మూడ్‌లో ఉన్నాడనే విషయం స్పష్టమవుతుంది. ఇక ‘వినయ విధేయ రామ’ చిత్రానికి దేవి శ్రీ అసలు గుర్తుంచుకోలేని విధంగా ట్యూన్స్‌ ని అందించాడు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో కూడా ఆయన మార్క్‌ కనిపించలేదు. ‘ఎఫ్‌ 2’ విషయంలో కూడా దేవి శ్రీ నిరుత్సాహ పరిచాడు. ఒకవైపు దేవి శ్రీ డౌన్‌ఫాల్‌ స్టార్ట్‌ అవుతుంటే ఇప్పటి వరకు కాపీ క్యాట్‌గా పేరు తెచ్చుకున్న థమన్‌ మాత్రం తనలోని వైవిధ్యాన్ని కిందటి ఏడాది నుంచి భలేగా చూపిస్తున్నాడు. భాగమతి, తొలిప్రేమ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌ ఈ ఏడాది అక్కినేని అఖిల్‌ నటించిన మూడో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’కి మంచి సంగీతం అందించాడు.

ఆకట్టుకుంటున్న ‘మిస్టర్ మజ్ను’ ఆల్బమ్

ఈ చిత్రం పూర్తి ఆడియో ఆల్బమ్‌ తాజాగా విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానుంది. ‘మిస్టర్‌ మజ్ను’ ఆల్బమ్‌ మంచి ట్యూన్స్‌ తో, మెలోడీతో అన్ని రకాల పాటలతో ఎంతో బాగుంది. గతంలో వెంకీ అట్లూరి – తమన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘తొలిప్రేమ’ మ్యాజిక్‌ని మరోసారి ఈ చిత్రం రిపీట్‌ చేస్తోంది. ఇందులోని ఆరు పాటలు మెలోడీగా, ట్రెండీగా ఉండటంతో ఈ ఏడాది మొదటి మ్యూజికల్‌ హిట్‌ ఆల్బమ్‌ ‘మిస్టర్‌ మజ్ను’నే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలకు తగ్గట్టుగా తెరపై వెంకీ అట్లూరి విజువల్‌గా చూపిస్తే ఈ పాటలు ఐఫీస్ట్‌ గా మారడం ఖాయమనే చెప్పాలి. మొత్తానికి తమన్‌ జోరును మరింతగా పెంచేలా ఈ పాటలు ఉండటం సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోందనే చెప్పాలి.

Tags:    

Similar News