మన హీరోలు ఆ మ్యూజిక్ డైరెక్టర్లని మారిస్తే బెటరా..?

Update: 2018-12-20 08:30 GMT

సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ నుండి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి రేస్ లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా 'ఎన్టీఆర్' బయోపిక్, 'వినయ విధేయ రామ', 'ఎఫ్2' వస్తున్నాయి. దాదాపు రెండు వందల కోట్లకు పైగా పెట్టుబడులతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పందమే ఆడుతున్నారు. దానికి తగట్టు ప్రమోషన్స్ కూడా శరవేగంగా స్టార్ట్ చేశారు. 'ఎన్టీఆర్' నుండి వారానికి ఒక రోజు పోస్టర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అలానే రామ్ చరణ్ - బోయపాటిల సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ ట్యూన్స్ చాలా చప్పగా..రొటీన్ గా ఉండడంతో జనాలు ఈ సాంగ్స్ ని పట్టించుకోలేని పరిస్థితి. ఫ్యామిలీ సాంగ్, మొన్న రిలీజ్ అయిన 'తస్సాదియ్యా మామమియా' రెండు సాంగ్స్ గతంలో చాలా సార్లు విన్న ఫీలింగ్ కలిగించింది. ఇక వెంకీ -వరుణ్ లు నటించిన 'ఎఫ్2'లో వదిలిన 'రెచ్చిపో బ్రదరూ' కూడా ఇదే బాపతులోకి వచ్చేలా ఉంది.

వారిద్దరినీ వదలని డైరెక్టర్లు...

'ఎన్టీఆర్' బయోపిక్ నుండి రెండు సాంగ్స్ వచ్చాయి. అవి వినటానికి కొంచం కొత్తగా ఉన్నా సినిమాలో చూస్తే ఆ ఫీల్ బాగుంటుందని అంటున్నారు. అలానే తమన్ తన సంగీతంతో ఈ మధ్య అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కవచం'లో సాంగ్స్ పేర్లు కూడా తెలియని పరిస్థితి. 'మిస్టర్ మజ్ను'లో మొదటి పాట కొంచం పర్లేదు అనిపించింది అంతే. ఈ సాంగ్ కొంతమందికే నచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మెలోడీ కాబట్టి. టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోస్, డైరెక్టర్స్ దేవిని, తమన్ ని కాదని బయటికి వెళ్లడం లేదు. మరి వారేమో బలమైన ముద్ర వేసే స్థాయిలో సాంగ్స్ ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో. కొత్త వారితో వెళ్తే కొంచెం బెటర్ అని అంటున్నారు.

Similar News