ఓవర్సీస్ ప్రేక్షకులు మారిపోయారు..!

ఇండియాలో అన్ని భాషల్లో తెరకెక్కే సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. అక్కడ ఫ్యామిలీ, కామెడీ, చరిత్రాత్మక కథలతో తెరకెక్కే సినిమాలకు బాగా డిమాండ్ ఉంటుంది. అక్కడి [more]

Update: 2019-04-16 07:58 GMT

ఇండియాలో అన్ని భాషల్లో తెరకెక్కే సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. అక్కడ ఫ్యామిలీ, కామెడీ, చరిత్రాత్మక కథలతో తెరకెక్కే సినిమాలకు బాగా డిమాండ్ ఉంటుంది. అక్కడి ప్రేక్షకులు తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలను బాగా ఆదరిస్తారు. అయితే ప్రస్తుతం ఓవర్సీస్ ప్రేక్షకులు మారినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఈమధ్యన విడుదలైన సినిమాలను ఆచితూచి అంచనా వేసి మరీ థియేటర్స్ కి వెళుతున్నారు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలకు అక్కడ కలెక్షన్స్ రావడం లేదు. తాజాగా మజిలీ సినిమా విషయంలో అదే జరిగింది. చైతు, సమంత జంటగా నటించిన మజిలీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ లో దూసుకుపోతుంటే.. ఓవర్సీస్ లో ఉసూరుమనే కలెక్షన్స్ తో ఉంది.

చిత్రలహరి కూడా అంతే…

మొదటి వారంలో ఫర్వాలేదనిపించింది ఈ సినిమా. మజిలీ రెండో వారంలో ఓవర్సీస్ లో చేతులెత్తేసింది. ఇక తాజాగా మరో తెలుగు సినిమా కూడా ఓవర్సీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యలేకపోయింది. అదే సాయి తేజ్ చిత్రలహరి. చిత్రలహరి వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు బాగున్నాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం చిత్రలహరి అంతగా ప్రభావం చూపించలేకపోతుండడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా కనబడడం లేదంటున్నారు ట్రేడ్ నిపుణులు. మరి ఓ అన్నట్టు సూపర్ హిట్ అయితే తప్ప ఓవర్సీసీ లో సినిమాలు ఆడేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News