అమెరికాలో తెలుగు హీరోల క్రేజ్ తగ్గిందా..?!

Update: 2018-10-26 09:39 GMT

అమెరికాలో తెలుగు హీరోలు ఏదైనా ఈవెంట్ లో పాల్గొంటే.. అక్కడ ఎన్నారై లు తెగ ఇదై పోతారు. తమకిష్టమైన హీరోలతో తాము కొద్ది సమయం గడపొచ్చనుకుంటారు. అందుకే అక్కడ జరిగే ప్రోగ్రాం కి టికెట్ రేటు ఎంతైనా పెట్టి కొంటారు. గతంలో చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఫండ్ రైసింగ్ ఈవెంట్స్ లో పాల్గొనేవారు. అయితే తాజాగా స్టార్ హీరోల క్రేజ్ అమెరికాలో అమాంతం పడిపోయిదనే టాక్ అయితే బాగా నడుస్తుంది. ఇక్కడ మా అసోసిషియన్ లో తలెత్తిన విభేదాలతో అది గత నెలలోనే తేటతెల్లమైంది. ఇక మా అసోసియేషన్ గొడవలకు ముందు నుండే టాలీవుడ్ వారు చేసే ఈవెంట్స్ కి అమెరికాలో క్రేజ్ తగ్గడం.. తర్వాత చిరు పాల్గొన్న ఫండ్ రైసింగ్ ఈవెంట్ కి స్పందన తక్కువగా ఉండడం జరిగింది.

స్పందన లేక ఈవెంట్ రద్దు

ఇక తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అమెరికాలో జరిగే ఒక ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ కోసం అమెరికాలోనే ఉండడంతో అక్కడి తెలుగు సంఘాలు మహేష్ ని గెస్ట్ గా పిలిచి ఒక ఈవెంట్ ని తలపెట్టారు. అయితే, అనుకోకుండా ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది మాత్రం మహేష్ ఈవెంట్ కి అక్కడి నుండి స్పందన కరువవడమే అంటున్నారు. మహేష్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ ఈవెంట్ కి మరీ టికెట్ రేటు ఏకంగా 2 వేల డాలర్లుగా పెట్టారట. మరి ఆ ఈవెంట్ మీద పెద్ద ఆసక్తిలేని వారు అంత పెద్ద మొత్తం వెచ్చించి టికెట్ కొనకపోయేసరికి ఆ టికెట్ రేటుని నిర్వాహకులు సగానికి సగం తగ్గించినా ఈవెంటుకి క్రేజ్ రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. అందుకే నిర్వాహకులు ఆ ఈవెంట్ ని రద్దు చేసినట్లు తెలుస్తుంది. మరి ఫండ్ రైసింగ్ ఈవెంట్స్ కి విశేష ఆదరణ ఉండే అమెరికాలో ఇలా జరగడం దేనికి సూచనో అనేది మాత్రం అర్ధం కావడం లేదు.

Similar News